close
Choose your channels

'థ్యాంక్యూ' టీజర్‌

Wednesday, May 25, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది లవ్‌స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య తనకు సూటయ్యే కథలతో దూసుకెళ్తున్నారు. యూత్, ప్రేమ కథలను చేస్తూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా చైతూ నటించిన మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి దృశ్య కావ్యాన్ని అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసిన మేకర్స్ దీనిలో భాగంగా బుధవారం థ్యాంక్యూ టీజర్‌ను రిలీజ్ చేశారు. బిజినెస్ టైకూన్ అభిరామ్ పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నారు. ఓ సాధారణ కుర్రాడి నుంచి ఈ స్థాయికి ఆయన ఎదిగినట్లు చూపించారు. ఈ జర్నీలో అతనికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఆయన స్కూల్‌లో మాళవిక నాయర్‌తో, స్పోర్ట్స్ పర్సన్‌గా ఉన్నప్పుడు అవికా గోర్‌తో, బిజినెస్‌ మ్యాన్‌గా ఎదిగాక రాశీఖన్నాతో ప్రేమలో పడటాన్ని చూపించారు.

నువు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్ లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు అని హీరోయిన్ చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే "అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను, ఇక లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే .. అంటూ చైతూ చెప్పిన డైలాగ్ ఆలోచింపజేస్తోంది.

థ్యాంక్యూలో నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బీవీయస్ రవి ఈ సినిమాకు కథ అందించగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.