రామ్ సినిమాలో 'మన్మథుడు 2' బ్యూటీ.. రోల్ ఏంటో తెలుసా ?

  • IndiaGlitz, [Saturday,July 31 2021]

హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి, రామ్ తొలిసారి జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంపై రామ్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి.

ఈ మూవీలో తారాగణం కూడా భారీగానే ఉంది. రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విలన్ పాత్ర కోసం లింగుస్వామి ఆది పినిశెట్టిని ఎంపిక చేసుకుని అందరిని సర్ ప్రైజ్ చేశారు. ఆది పినిశెట్టి.. సరైనోడు, అజ్ఞాతవాసి చిత్రాల్లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

అత్తారింటికి దారేది ఫేమ్ నదియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా మరో హాట్ బ్యూటీ ఈ మూవీలో క్రేజీ రోల్ లో నటిస్తోంది. మన్మథుడు 2 లో చిన్న రోల్ లో మెరిసిన కన్నడ అందాల భామ అక్షర గౌడ ఈ చిత్రంలో ఆది పినిశెట్టికి పెయిర్ గా కనిపించనుందట. ఆల్రెడీ అక్షర షూట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

అక్షర గౌడ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ పాపులర్ అవుతోంది. తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తోంది. లింగుస్వామి ఈ చిత్రాన్ని సోషల్ మెసేజ్ ప్లస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీత దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

టోక్యో ఒలంపిక్స్ : సెమీస్ లో పీవీ సింధు ఓటమి.. ఆ ఛాన్స్ ఇంకా ఉంది!

తెలుగు తేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. టోక్యో ఒలంపిక్స్ లో నేడు జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆమె ఓటమి చెందింది.

సంచలన రికార్డ్ అందుకున్న 'కాటుక కనులే' సాంగ్

ఆకాశం నీ హద్దురా చిత్రం సూర్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇది కమర్షియల్ మూవీ కాదు.

'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ అదిరింది.. కారు అద్దాలు పగిలిపోయాయి

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట.

హాట్ అనసూయ ఎయిర్ హోస్టెస్ గా.. మరో డిఫెరెంట్ అటెంప్ట్

అందాల యాంకర్ అనసూయ టాలీవుడ్ లో నటిగా దూసుకుపోతోంది. అనసూయ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్ని ఎంపిక చేసుకుంటూ రాణిస్తోంది.

సునీల్ పాత్రలో బిగ్ ట్విస్ట్.. అంచనాలు పెంచేస్తున్న 'పుష్ప'

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.