close
Choose your channels

విక్రమ్ టాలెంటెడ్ యాక్టర్.. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్! - అక్ష‌ర‌హాస‌న్

Tuesday, July 16, 2019 • తెలుగు Comments

క‌మ‌ల్‌హాస‌న్, సారిక‌ల రెండ‌వ కుమార్తె అక్ష‌ర‌హాస‌న్ నటిస్తున్న రెండో చిత్రం ‘మిస్ట‌ర్ కేకే’. ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో రూపోందుతోంది. కాగా గ‌తంలో బాలీవుడ్‌లో ష‌మితాబ్ చిత్రంలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అక్షర.. ఈ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకుంటోంది. జులై 19న ‘మిస్టర్ కేకే’ను అత్యధిక థియేటర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రం పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా థ్రిల్‌ని అందించే విధంగా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించినట్లు ఇప్పటి వరకూ విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్‌లను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. త్వరలో ‘మిస్టర్ కేకే’ అభిమానుల ముందుకు రానున్న సందర్భంగా మూవీ ప్రమోషన్‌లో భాగంగా అక్ష‌ర‌హాస‌న్ మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సందర్భంగా సినిమా గురించి తన పర్సనల్ లైఫ్, మున్ముంథు చేయబోతున్న ప్రాజెక్టులతో పాటు పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

‘మిస్టర్ కేకే’ మూవీ గురించి..!

"ష‌మితాబ్ త‌ర్వాత ఈ రెండో చిత్రంలో వివాహితగా న‌టించ‌డం.. ఇది నాకొక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఇచ్చింది. సీన్స్ అన్నీ కూడా నా మొద‌టి చిత్రానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి. ఇటువంటి క్యారెక్ట‌ర్‌లో కూడా నేను బాగా న‌టించాల‌ని బాగా కృషి చేశాను. ఒక యాక్ట‌ర్‌గా ఎటువంటి పాత్ర‌నైనా ఛాలెంజింగ్‌గా తీసుకుని చెయ్యాల‌న్న‌దే నా ఉద్దేశం. ఈ సినిమాలో నా పాత్ర పేరు అథిర‌. నేను ఈ చిత్రంలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్‌గా న‌టిస్తున్నాను. అభిహాస‌న్‌కి భార్య‌గా ఇంత‌క‌న్నా నా పాత్ర గురించి చెప్ప‌లేను అది స‌స్పెన్స్ అన్నారు. ఈ సినిమాకి నాన్న‌గారి నుంచి రెమ్యూనిరేష‌న్ తీసుకున్నాను. విక్రమ్‌తో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న‌తో ఈ ప్రాజెక్ట్‌లో ఆయ‌న న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న‌తో న‌టించ‌డంతో  నాకొక మంచి ఎక్స్‌పీరియ‌న్స్ వ‌చ్చింది. ఆయ‌న న‌న్ను చాలా మోటివేట్ చేసి చాలా హెల్ప్ చేశారు. చాలా ఇంట్ర‌స్టింగ్ ప‌ర్స‌నాలిటీ. ఆయ‌న‌తో ప‌ని చెయ్య‌డం చాలా ఈజీగా అనిపించింది. చాలా టాలెంటెడ్ యాక్ట‌ర్ కావ‌డంతో ఆయ‌న నుంచి చాలా నేర్చుకోవ‌చ్చు" అని అక్షర చెప్పుకొచ్చింది.

ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్!

"ఒక ప్రెగ్నెంట్ ఉమెన్‌గా చేసేట‌ప్పుడు నేను ఎక్కువ‌గా మా అమ్మ నుంచి నేర్చుకున్నాను. అమ్మ నాకు ప్ర‌తీ సీన్ ఇలా చెయ్యాలి అలా న‌డ‌వాలి అని ద‌గ్గ‌రుండి ప్ర‌తీ సీన్ చేసి చూపించింది. ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని అలాగే నా స్నేహితులు కొంద‌రు కూడా చాలా హెల్ప్‌ చేశారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది చాలా ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్ అనే చెప్పాలి. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్. నేను నా ఇష్ట‌ప్ర‌కార‌మే కథలు ఎంచుకుంటాను. మా ఇంట్లోవాళ్ళు కూడా నేను సొంతంగా పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డ‌మే ఇష్ట‌ప‌డ‌తారు. నేను కూడా నా సొంతంగా ఎంచుకోవాల‌నుకుంటాను. మా నాన్న‌గారు కూడా ఎన్నో విభిన్న‌పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే మా అమ్మ ఇద్ద‌రూ కూడా చాలా మంచి యాక్ట‌ర్స్‌" అని చెప్పుకొచ్చింది.

తెలుగులోనే కాదు.. డైరెక్టర్‌గా కూడా!

తెలుగులో కూడా నటిస్తాను కానీ ఇప్పుడు కాదు. ఇంకా నాకు తెలుగు భాషపై పెద్ద‌గా ప‌ట్టురాలేదు. తెలుగు నేర్చుకున్నాక కచ్చితంగా చేస్తాను. తెలుగు సినిమాలు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి. నేను చూడ‌డానికి ఇష్ట‌ప‌డ‌తా. తెలుగు నుంచి కొన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. చూడాలి ముందు ముందు ఏం జ‌రుగుద్దో. నేను కేవ‌లం ఒక యాక్ట‌ర్‌గానే కాదు.. నాకు డైరెక్ష‌న్ చెయ్యాలంటే ఇష్టం రెండు మూడు క‌థ‌లు కూడా విన్నాను. మా నాన్న‌గారు ఒప్పుకుంటే మా బ్యాన‌ర్‌లోనే చెయ్యాల‌నుకుంటున్నాను" అని తన ఇంటర్వ్యూను అక్షర ముగించింది.

Get Breaking News Alerts From IndiaGlitz