భార్య‌కు ఉల్లిపాయ క‌మ్మ‌లు ఇచ్చిన హీరో

  • IndiaGlitz, [Saturday,December 14 2019]

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ త‌న భార్య ట్వింక‌ల్ ఖన్నా ఓ డిఫ‌రెంట్ బ‌హుమ‌తిని ఇచ్చారు. ఇంత‌కు అక్ష‌య్‌కుమార్ ట్వింక‌ల్‌కు ఇచ్చిన బ‌హుమ‌తి ఏంటో తెలుసా? ఉల్లిపాయ క‌మ్మ‌లు. అదేంటి బంగారు క‌మ్మ‌లు, వెండివో, ప్లాటినం క‌మ్మ‌లు అని వినే ఉంటాం కానీ.. ఉల్లిపాయ క‌మ్మలేంట‌నే సందేహం రావ‌చ్చు. దేశ‌మంత‌టా ఉల్లిధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న ఈ త‌రుణంలో అక్ష‌య్‌కుమార్ ఇలాంటి బ‌హుమ‌తిని త‌న భార్య‌కు ఇవ్వ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. గిఫ్ట్‌ను చూసిన ట్వింక‌ల్ వాటిని సంతోషంగా స్వీక‌రించి వాటిని అప్రిషియేట్ చేస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

అక్ష‌య్‌కుమార్, క‌రీనాక‌పూర్‌తో క‌లిసి న‌టించిన చిత్రం 'గుడ్‌న్యూస్‌'. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా అక్ష‌య్ కుమార్ స‌హా చిత్ర యూనిట్ ది క‌పిల్ శ‌ర్మషోకు హాజ‌ర‌య్యారు. ఆ షోలో అక్ష‌య్‌కుమార్ అనియ‌న్ రింగ్స్‌ను క‌రీనాకు చూపించారు. ఆమెకు అవి అంత‌గా న‌చ్చ‌లేదు. దాంతో వాటిని ఆయ‌న త‌న భార్య ట్వింక‌ల్‌కు బ‌హుమ‌తిగా ఇచ్చారు. ''సినిమా ప్ర‌మోష‌న్స్‌లో క‌పిల్‌శర్మ షో నుండి అక్ష‌య్ ఇంటికి వ‌చ్చారు. ఆయ‌న ఆనియ‌న్ రింగ్స్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. కొన్నిసార్లు ఇలాంటి చిన్న విష‌యాలే మ‌న హృద‌యానికి హ‌త్తుకుంటాయి'' అని మెసేజ్‌ను కూడా ఆ క‌మ్మ‌ల ఫొటోతో పాటు పోస్ట్ చేశారామె.

More News

జగన్ మరో కీలక నిర్ణయం: డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు

అవును మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి

‘హీ ఈజ్ సో క్యూట్’.. మహేశ్‌పై రష్మిక టిక్ టాక్ వీడియో

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

పెళ్లి వదంతులపై క్లారిటీ ఇచ్చేసిన కాజల్

సినీ ఇండస్ట్రీలో మోస్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో.. టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన కాజల్ అగర్వాల్ కూడా ఉంది.

సానియా మీర్జా చెల్లెలి రిసెప్షన్‌లో చెర్రీ, ఉపాసన సందడి

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ రారాణి సానియా మీర్జా సోదరి ఆనమ్‌ల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ఏపీలో ‘దిశ’ చట్టం వచ్చేసింది.. వేధించారో అంతే సంగతులు!

నిర్భయ లాంటి ఘటనల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట వేయడానికి కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ..