మోదీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్

  • IndiaGlitz, [Wednesday,April 24 2019]

''నేను ప్రధాన మంత్రి అవుతానని అసలు ఊహించలేదు. ప్రధాని కావాలని నేనెప్పుడూ కలగనలేదు. కుటుంబ ప్రమేయంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకున్నా. నేను క్రమశిక్షణ గల కార్యకర్తను. నేనే కఠినంగా ఉంటాను.. తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం అనుకోను'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా.. మోదీ ఈ వ్యాఖ్యలు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో 7లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్రమోదీతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని అంశాలపై చర్చించారు. అక్షయ్ అడిగిన ప్రశ్నలకు మోదీ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. కాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమోను అక్షయ్ తన ట్విట్టర్‌‌లో షేర్ చేశారు.

టీజర్‌లో ఏముంది..!?

మీకెప్పుడూ మీ అమ్మతో ఉండాలని, మీ సోదరులు, మీ బంధువులందరూ మీ ఇంట్లో మీతో ఉండాలని ఉండదా? అని అక్షయ్ ప్రశ్నించగా మోదీ స్పందిస్తూ తాను జీవితంలో చాలా చిన్నతనంలోనే వీటన్నింటినీ వదిలేశానన్నారు. చాలా చిన్న వయసులో మా అమ్మ నాతో అనేది.. నువ్వు నా వెనక తిరిగి ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నావు? అని చెప్పేది అని మోదీ ఒకింత ఆవేదనతో చెప్పారు. ఇలా.. ఇంటర్వ్యూలో అక్షయ్ అడిన ప్రతీ ప్రశ్నకు మోదీ ఆసక్తికరంగా సమధానమిచ్చారు.

More News

జగన్‌ లక్ష కోట్ల వ్యవహారం.. అసలు విషయం చెప్పిన మాజీ జేడీ

"లక్ష కోట్లు.. లక్ష కోట్లు.. వైఎస్ జగన్ లక్ష కోట్లు దోచుకున్నారు.. జగన్ రాజకీయాలకు అర్హుడు కాదు.. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని దొరికినదంతా దోచుకున్నాడు" అని అధికార పార్టీకి చెందిన నేతలు

సచిన్‌‌కు వెరైటీగా బర్త్ ‌డే విషెస్ చెప్పిన రామ్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌‌ పుట్టిన రోజు నేడు. నేటితో ఆయన 46వ పడిలోకి అడుగుపెడుతున్నారు.

మా అమ్మ-నాన్న విడిపోవడానికి కారణమిదే: మెగా హీరో

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, 'చిత్రలహరి' మూవీ హీరో సాయిధరమ్‌లో ఓ యూట్యూట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు మెగాభిమానులు, సినీ ప్రియులతో షేర్ చేసుకున్నాడు.

ప్ర‌భాస్‌కు ఊర‌ట‌

రాయ్‌దుర్గ్ ప‌న్మ‌క్త్ గ్రామంలో హీరో ప్ర‌భాస్ కోనుగోలు చేసిన భూమి ప్ర‌భుత్వ భూమి అంటూ.. అధికారులు దానికి తాళాలు వేశారు.

పెళ్లి గురించి హీరోయిన్ ఏం చెప్పిందో తెలుసా!

తెలుగులో హ‌లోతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. ఈ సినిమా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌కు