close
Choose your channels

వామ్మో..! అక్ష‌య్‌కుమార్ పారితోషికం ఎంతో తెలుసా ?

Saturday, March 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వామ్మో..! అక్ష‌య్‌కుమార్ పారితోషికం ఎంతో తెలుసా ?

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ రీసెంట్‌గా విడుద‌లైన కేస‌రితో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము రేపుతున్న అక్ష‌య్ త్వ‌ర‌లోనే డిజిట‌ల్ మాధ్య‌మంలోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. `ది ఎండ్` అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొంద‌నుంది. ఈ వెబ్ సిరీస్ కోసం అక్ష‌య్‌కుమార్ భారీగానే రెమ్యురేష‌న్‌ను అందుకోబోతున్న‌ట్లు బాలీవుడ్ మీడియా వ‌ర్గాల క‌థ‌నం.

విన‌ప‌డుతున్న స‌మాచారం మేర ఈ వెబ్ సిరీస్‌కు అక్ష‌య్‌కుమార్ 90 కోట్ల రూపాయ‌ల‌ను తీసుకుంటున్నాడ‌ట‌. ఈ వెబ్ సిరీస్ మూడు సీజ‌న్స్‌గా రూపొంద‌నుంది. అందుకోసం ప‌క్కా ప్లానింగ్‌తో త‌న డేట్స్‌ను అడ్జ‌స్ట్ చేశాడ‌ట ఈ బాలీవుడ్ ఖిలాడి..రీసెంట్‌గా ఈ వెబ్ సిరీస్‌ను అనౌన్స్‌మెంట్ కార్య‌క్ర‌మంలో ఒళ్లంతా మంట‌లు పెట్టుకుని అక్ష‌య్‌క‌మార్ స్టేజ్‌పై పెద్ద రచ్చే చేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.