తన ప్లానింగ్ తో అందరికి షాకిచ్చిన అక్షయ్ కుమార్

  • IndiaGlitz, [Monday,November 11 2019]

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ ఇప్పుడు హిట్ మిష‌న్‌గా మారాడు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో పాటు, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనూ న‌టిస్తూ అక్ష‌య్ దూసుకెళ్తున్నాడు. స్టార్ హీరోలంద‌రూ ఏడాదికి ఒక‌ట్రెండు సినిమాలు చేస్తుంటే అక్ష‌య్ కుమార్ మాత్రం ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా ఈయ‌న మ‌రో కొత్త సినిమాను త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌బోయే చిత్రం 'బెల్‌బాట‌మ్‌'లో అక్ష‌య్ హీరోగా న‌టించ‌బోతున్నాడు.

'ల‌క్‌నౌ' ఫేమ్ రంజిత్ తివారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను జ‌న‌వ‌రి 22, 2021లో విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. ఇలా మూవీని అధికారికంగా ప్ర‌క‌టించిన రోజునే రిలీజ్ డేట్‌ను కూడా ప్ర‌క‌టించి త‌న ప్లానింగ్ గురించి అంద‌రికీ షాకిచ్చాడు అక్కి.

అక్ష‌య్ ఇక్క‌డ మ‌రో విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించాడు. అదేంటంటే.. అక్ష‌య్ సినిమాను అనౌన్స్ చేయ‌గానే ఇది ఓ క‌న్న‌డ చిత్రానికి రీమేక్ అనే వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై కూడా అక్ష‌య్ వెంట‌నే స్పందించారు. త‌న సినిమా ఏ సినిమాకు రీమేక్ కాదు.. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన ఓరిజన‌ల్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే అక్ష‌య్ కుమార్ చేతిలో ఐదారు సినిమాలున్నాయి.

More News

క‌న్న‌డ హీరోయిన్‌తో బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఒక ప‌క్క రూల‌ర్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. మ‌రో ప‌క్క బోయ‌పాటితో సినిమాకు రెడీ అవుతున్నాడు.

క్రికెట్ షాట్‌తో ఆక‌ట్టుకుంటున్న ర‌ణ్వీర్‌ సింగ్‌

భార‌త‌దేశ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 ఏడాదిని మ‌ర‌చిపోలేం.  క‌పిల్ దేవ్ నాయ‌క‌త్వంలో తిరుగులేని వెస్టీండిస్ టీమ్‌పై విజ‌యాన్ని సాధించిన  క్రికెట్ విశ్వ‌విజేత‌గా భార‌త‌దేశం ఆవిర్భ‌వించిన సంవ‌త్స‌ర‌మది.

'పిచ్చోడు' మూవీ ఫస్ట్ లుక్

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు.

'90 ఎంఎల్‌' డిసెంబ‌ర్ 5న విడుద‌ల

'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన '90 ఎం.ఎల్‌` రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. డిసెంబ‌ర్ 5న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది.

'క్లైమాక్స్' చిత్రంలో తన రియల్ లైఫ్ క్యారెక్టర్ లో శ్రీరెడ్డి

`డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ ల్స్ లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో