చిరుతో అక్షయ్..?

  • IndiaGlitz, [Saturday,March 25 2017]

ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ చిత్రం స‌క్సెస్‌తో గ్రాండ్ రీఎంట్రీ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. భార‌త‌దేశ్వ స్వాతంత్ర్యంలో భాగంగా బ్రిటీష్ వారిని ఎదిరించిన తెలుగు తేజం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌తో చిరు 151వ సినిమా ఉంటుంది. ఈ సినిమాను సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తాడు. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఓకే అయ్యిన‌ట్టే.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్‌కుమార్‌ను సంప్ర‌దించార‌ని వార్త‌లు విన‌పడుతున్నాయి. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అయిన అక్ష‌య్‌కుమార్ ర‌జ‌నీకాంత్ రోబో సీక్వెల్ 2.0తో ద‌క్షిణాదిన తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు చిరు సినిమాకు ఓకే చెబుతాడా..అక్ష‌య్ అడిగినంత రెమ్యున‌రేష‌న్ చ‌ర‌ణ్ ఇస్తాడా..అంతా ఓకే అయితే అక్ష‌య్ న‌టిస్తాడ‌నే అనుకోవాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ...

More News

ఏంజెల్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్

యంగ్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్ నిన్న(మార్చి 24న) ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగాయి. ఈ వేడుకకు ఫిల్మ్ మీడియా ప్రతినిధులతో పాటు, ఏంజెల్ చిత్రం నిర్మాత భువన్ సాగర్, డైరెక్టర్ బాహుబలి పళని తదితరలు హాజరైయ్యారు.

'చెలియా' సెన్సార్ పూర్తి...ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం 'చెలియా'.

'బాబు బాగా బిజి' ధియోట్రికల్ ట్రైలర్ కి అనూహ్య మైన స్పందన

దాదాపు 90కి పైగా చిత్రాల్ని పంపిణీచేసి మెట్టమెదటిసారిగా ప్రోడక్షన్ ని ప్రారంభించిన శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాతగా, సెన్సిటివ్ పాయింట్స్ చిత్రాలతో దర్శకుడిగా, నటుడుగా పేరుతెచ్చుకున్నదర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా మంచి కమర్షియల్ కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ.

తమిళ రీమేక్ లో రవితేజ

గతేడాది సినిమాలే చేయని రవితేజ ఈ ఏడాది విక్రమ్ సిరి దర్శకత్వంలో ఒక సినిమా,అనిల్ రావిపూడి దర్శకత్వంలో

ఉగాది రోజు రామ్ కొత్త చిత్రం ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్,పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో