లారెన్స్‌తో వివాదంపై స్పందించిన అక్ష‌య్‌

  • IndiaGlitz, [Friday,January 03 2020]

కొరియోగ్రాఫ‌ర్‌, న‌టుడు, నిర్మాత, ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన కామెడీ హార‌ర్ జోన‌ర్ సిరీస్ కాంచ‌న ఇప్పుడు బాలీవుడ్‌లో రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కాంచ‌న సినిమాను 'ల‌క్ష్మీబాంబ్' పేరుతో రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా మేకింగ్‌లో లారెన్స్‌, నిర్మాత‌ల‌కు మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింది. త‌న అనుమ‌తి తీసుకోకుండా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌డంపై లారెన్స్ సీరియ‌స్ అయ్యాడు. తాను సినిమా నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయితే రంగంలోకి దిగిన అక్ష‌య్ కుమార్ వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌పెట్టాడు. దాంతో మ‌ళ్లీ సినిమా చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి లారెన్స్ ఒప్పుకున్నాడు. సినిమా చిత్రీక‌ర‌ణ జ‌ర‌గుతుంది. ఈ చిత్రం మే నెల‌లో విడుద‌ల కానుంది. ఈ వ్య‌వ‌హారంపై తొలిసారిగా అక్ష‌య్ కుమార్ స్పందించారు.

''లారెన్స్‌కి, నిర్మాత‌ల‌కు మ‌ధ్య ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నారు. త‌ర్వాత ఎవ‌రూ దీనిపై నోరు మెద‌ప‌లేదు. సినిమా అంతా షెడ్యూల ప్ర‌కార‌మే జ‌రుగుతుంది. హార‌ర్, థ్రిల్ల‌ర్ జోన‌ర్ గురించి బాగా తెలిసిన ద‌ర్శ‌కుడు లారెన్స్‌. సినిమాలో పాత్ర కోసం చీర‌లు క‌ట్టుకుని న‌టిస్తుండ‌టం కొత్త‌గా ఉంది. ట్రిక్‌తో కూడుకున్న స‌న్నివేశాల్లో న‌టిస్తున్నాను'' అన్నారు అక్ష‌య్‌. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గాన టిస్తోంది.

More News

చిరు 152కి బాలీవుడ్ హీరో వ‌ల్ల ఇబ్బంది క‌లుగుతుందా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్ కోకాపేట‌లో స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.

న‌రేష్‌పై శివాజీరాజా హాట్ కామెంట్స్‌.. త‌మ్మారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

`మా` డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో రాజ‌శేఖ‌ర్ ప్ర‌వ‌ర్తించిన తీరుతో మ‌రోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో ఉన్న లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

'అల వైకుంఠపురంలో..' సెన్సార్ పూర్తి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ‘గర్జన’

మనిషి, జంతువు... వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువు దాడి చేస్తుంది...

'నమస్తే నేస్తమా`చిత్రానికి థియేటర్స్ లో 80పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండడం సంతోషంగా ఉంది - దర్శక నిర్మాత  కె.సి బొకాడియా

యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్స్ సాధించాయి. ఒక డాగ్ ప్రధాన పాత్రలో