విదేశాల్లో 'అల వైకుంఠ‌పుర‌ములో' నెక్ట్స్ షెడ్యూల్‌

  • IndiaGlitz, [Monday,October 07 2019]

'జులాయి', 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో బ‌న్నీకి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా... కీల‌క పాత్ర‌ల్లో ట‌బు, నివేదా పేతురాజ్‌, న‌వ‌దీప్‌, సుశాంత్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, జ‌య‌రామ్‌, సునీల్ న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఆన్ గోయింగ్ షెడ్యూల్... హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌రాస్‌లో జ‌రుగుతోంది. ఇది పూర్త‌య్యాక యూనిట్‌.. ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసింద‌ని స‌మాచారం. అంతేకాదు.. ఈ నెల‌లోనే ఈ షెడ్యూల్ మొద‌ల‌వుతుంద‌ని తెలిసింది.

కాగా.. ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. 'రేసు గుర్రం', 'స‌రైనోడు' వంటి ఘ‌న‌విజ‌యాల త‌రువాత బ‌న్నీ, థ‌మ‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో 'అల వైకుంఠ‌పుర‌ములో' ఆడియోపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఆ క్రేజ్‌కు త‌గ్గ‌ట్టే.. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ సింగిల్ 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌' యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న 'అల వైకుంఠ‌పుర‌ములో' ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.