close
Choose your channels

‘అల వైకుంఠ‌పుములో’ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా?

Monday, April 6, 2020 • తెలుగు Comments

‘అల వైకుంఠ‌పుములో’ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా?

ఈ ఏడాది తెలుగు సినిమాకు మంచి ప్రారంభ‌మే ద‌క్కింది. రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా కూడా ఉంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వ‌వ‌లో బ‌న్నీ న‌టించిన ఈ హ్యాట్రిక్ మూవీ రూ.200 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సొంతం చేసుకుంది.

‘అల వైకుంఠ‌పుములో’ స‌క్సెస్ చూసిన బాలీవుడ్ మేక‌ర్ అశ్విన్ వ‌ర్దే ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ట‌. వివ‌రాల మేర‌కు రూ. 8 కోట్లతో అశ్విన్ వ‌ర్దే రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ట‌. ప్రారంభంలో బాలీవుడ్ రీమేక్‌లో అర‌వింద్ కూడా భాగ‌మ‌వుతార‌ని వార్త‌లు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేద‌ని బాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు అల వైకుంఠ‌పుర‌ములో బాలీవుడ్ రీమేక్‌లో అక్ష‌య్ కుమార్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. బాలీవుడ్ నిర్మాత అక్ష‌య్‌ను సంప్ర‌దిస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ రీమేక్‌పై ఓక్లారిటీ రానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz