స‌మంతా గ్యారేజ్ లో ఆలీ..!

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

ఏ సినిమా అయినా విజ‌యం సాధిస్తే...ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ను స్పూఫ్ చేస్తుండ‌డం మామూలే. ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్ సినిమాలోని కొన్ని సీన్స్ ను స్పూఫ్ చేస్తున్నారు. ఇంత‌కీ ఏ సినిమాలో కోసం అంటే....అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కోసం జ‌న‌తా గ్యారేజ్ ను స‌మంతా గ్యారేజ్ గా మార్చేసి ఆలీ పై స్పూఫ్ చేస్తున్నార‌ట‌. మోహ‌న్ లాల్ పాత్ర‌ను భ‌జ‌న్ లాల్ గా మార్చేసార‌ట‌. ఇటీవ‌ల ఈ స్పూఫ్ కి సంబంధించిన స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఆలీ భ‌జ‌న్ లాల్ గెట‌ప్ ఎలా ఉంటుందో తెలియ‌చేసేందుకు ఆలీతో సెల్ఫీ తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు డైరెక్ట‌ర్ నాగేశ్వ‌ర‌రెడ్డి. గెట‌ప్ బాగానే ఉంది మ‌రి...తెర పై స్పూఫ్ ఎలా ఉంటుందో చూడాలి..!

More News

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న రాజ‌శేఖ‌ర్ కుమార్తె..!

డా.రాజ‌శేఖ‌ర్ - జీవిత దంప‌తుల కుమార్తె శివాని ఎంట్రీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌శేఖ‌ర్ తండ్రిగా శివాని కుమార్తెగా ఓ సినిమా అనుకున్నారు కానీ ఎందుక‌నో ఈ ప్రాజెక్ట్ తెర పైకి రాలేదు.

క్రిస్మస్ క్యూ క‌డుతున్న సినిమాలు ఇవే..!

ద‌స‌రాకి ఓ నాలుగైదు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు క్రిస్మ‌స్ కానుక‌గా సినిమాలు రిలీజ్ చేసేందుకు పోటీప‌డుతున్నారు నిర్మాత‌లు.

చైతు...రెండు సినిమాలు ఒకేసారి

అక్కినేని నాగచైతన్య రెండు సినిమాలు సాహసం శ్వాసగా, ప్రేమమ్ సినిమాలు విడుదలకు సిద్ధమైయ్యాయి. ఇవి విడుదలక కాకమునుపే చైతన్య మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

టిప్పు మూడో ప్రయత్నం

`టిప్పు`, `పడేసావే` చిత్రాల హీరో కార్తీక్ రాజు ఇప్పుడు మరో సినిమా  చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తొలి రెండు చిత్రాలతో అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన ఈ యువ హీరో మూడోసారి ఓ లవ్ ఎంటర్ ను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.

నాలోని ద‌ర్శ‌కుడిని నాకు ప‌రిచ‌యం చేసింది క‌ళ్యాణ్ గారే - సిద్దార్ధ డైరెక్ట‌ర్ ద‌యానంద‌రెడ్డి

సాగ‌ర్, రాగిణి, సాక్షి చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా ద‌యానంద‌రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించారు.