అలీ చేతులమీదుగా 'బ్లాక్ మనీ' ట్రైలర్ ఆవిష్కరణ

  • IndiaGlitz, [Wednesday,April 12 2017]

సౌత్ సూప‌ర్‌స్టార్‌ మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ 'రన్ బేబి ర‌న్‌' తెలుగులోకి 'బ్లాక్‌మ‌నీ'. (.. అన్నీ కొత్త నోట్లే) పేరుతో ఈనెల 21న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. నిజామ్ స‌మ‌ర్ప‌ణ‌లో మాజిన్ మూవీమేక‌ర్స్ ప‌తాకంపై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ ఇటీవ‌లే 'క్లీన్ యు' స‌ర్టిఫికెట్ ఇచ్చి చ‌క్క‌ని కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న సినిమా ఇద‌ని అభినందించింది. ఈనెల 21న తెలుగు రాష్ట్రాలు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ‌వుతోంది. తాజాగా స్టార్ క‌మెడియ‌న్ అలీ ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని హైద‌రాబాద్‌లో లాంచ్ చేశారు.
ఈ సంద‌ర్భంగా అలీ మాట్లాడుతూ -''మోహ‌న్‌లాల్ అంత పెద్ద స్టార్ న‌టించిన ఈ చిత్రం తెలుగులో పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా. ఇటీవ‌లి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న లాల్‌కి మ‌రో గ్రాండ్ స‌క్సెస్ గ్యారెంటీ. అంత పెద్ద స్టార్ న‌టించిన సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం క్రేజీగా ఫీల‌వుతున్నా. ఈ సినిమాతో విజ‌యం సాధించి చిత్ర‌నిర్మాత‌లు మ‌రిన్ని సినిమాలు తీయాలని ఆకాంక్షిస్తున్నా'' అన్నారు.
నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ -''స్టార్ క‌మెడియ‌న్ అలీ చేతుల‌మీదుగా బ్లాక్‌మ‌నీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం సంతోషంగా ఉంది. మంచి మ‌నసుతో మ‌మ్మ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తున్న అలీకి ధ‌న్య‌వాదాలు. మీడియా నేప‌థ్యంలో తెర‌కెక్కిన 'బ్లాక్‌మ‌నీ' పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ చిత్రంలో లాల్ ఓ టీవీచానెల్ కెమెరామేన్‌గా న‌టించారు. క‌థానాయిక అమ‌లాపాల్ సీనియ‌ర్ ఎడిట‌ర్ రేణుక పాత్ర‌లో న‌టించారు. సంబంధ బాంధ‌వ్యాలు, వృత్తిప‌ర‌మైన సంఘ‌ర్ష‌ణ చుట్టూ ఈ సినిమా క‌థాంశం తిరుగుతుంది. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక గ్రాస్ వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగులోనూ అంతే పెద్ద విజ‌యం అందుకుంటుంద‌ని ఆశిస్తున్నాం. అన్నిప‌నులు పూర్త‌య్యాయి. ఈనెల 21న రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.

More News

'దేవిశ్రీప్రసాద్' టీజర్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - దర్శకుడు శ్రీ కిషోర్

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.

యదార్థ ఘటన ఆధారంగా 'డేగల శ్రీను' ప్రారంభం

ఆర్.ఎఫ్.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అమర్నాథ్ మండూరి దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం బుదవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

నాని హీరోయిన్ తో నితిన్...

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `లై`. 14 రీల్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత నితిన్ పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.

నాని దర్శకుడితో అల్లుడు శీను..

హీరో నాని రీసెంట్ హిట్ `నేను లోకల్`. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేశాడు. అంతకు ముందు రాజ్ తరుణ్తో సినిమా చూపిస్తమావ సక్సెస్ను సాధించాడు త్రినాథరావు నక్కిన, ఈ డైరెక్టర్తో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ వర్క్ చేయబోతున్నాడట.

ఫ్యానీ రేటు నాని సినిమా థియేట్రికల్ రైట్స్...

వరుస సక్సెస్లను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు డివివి దానయ్య నిర్మాత శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న `నిన్ను కోరి` చిత్రంలో నటిస్తున్నాడు.