భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ఆలియా

  • IndiaGlitz, [Thursday,April 09 2020]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్.. గోండు వీరుడు కొమురంభీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నిజమైన చారిత్ర‌క పాత్రల క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. రూ.400 కోట్ల‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బ్రిటీష్ భామ ఒలివియా మోరిస్ న‌టిస్తుండ‌గా రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తోంది.

కరోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత మే నెల‌లో ప్రారంభం కాబోయే కొత్త షెడ్యూల్‌లో చ‌ర‌ణ్‌, ఆలియాపై ఓ పాట‌ను, కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఆర్ఆర్ఆర్ కోసం ఆలియా 10 రోజుల కాల్షీట్‌ను కేటాయించింద‌ట‌. అందుకుగానూ ఈ అమ్మ‌డు రూ.5 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటుంద‌ని టాక్‌. అంటే రోజుకు రూ.50 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ అన్న‌మాట‌. ఇంత భారీ రెమ్యున‌రేష‌న్ అందుకుంటుంన్నందుకు ఆలియా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ సోష‌ల్ మీడియాగా మారింది. ఆర్ఆర్ఆర్‌ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు.

More News

మ‌నవ‌డి కోసం మెగాఫోన్ ప‌ట్టిన కృష్ణ‌

తెలుగు సినిమాను సాంకేతికంగా కొత్త పుంత‌లు తొక్కించే దిశ‌గా అడుగులు వేసిన హీరోల్లో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. 350 సినిమాల్లో న‌టించిన కృష్ణ‌.. నిర్మాత‌గానే కాదు,

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా నేపథ్యంలో ఐటీ శాఖ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కాటేస్తున్న తరుణంలో.. ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5లక్షల కంటే తక్కువ ఉన్న పెండింగ్ ఇన్ కం ట్యాక్స్ రీ ఫండ్స్‌ను

డిశ్చార్జ్ అయిన కనికాకు కొత్త చిక్కులు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుంచి బాలీవుడ్ ప్రముఖ గాయని కనికాకపూర్ ఎట్టకేలకు కోలుకున్న సంగతి తెలిసిందే. గత 14 రోజులకుపైగా కరోనాపై పోరాడిన

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..

కరోనా మహమ్మారి తెలంగాణలో విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు రావడం గమనార్హం. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో..? అని రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.