close
Choose your channels

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం ఆలియా భట్‌ పాట

Friday, October 30, 2020 • తెలుగు Comments

`ఆర్‌ఆర్‌ఆర్‌` కోసం ఆలియా భట్‌ పాట

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). కోవిడ్‌ నేపథ్యంలో ఈ సినిమా రీసెంట్‌గా రీస్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. నవంబర్ నుండి ఆలియా భట్‌ సెట్స్‌లోకి జాయిన్‌ అవుతుందని టాక్‌. కాగా.. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఆలియాభట్‌, చరణ్‌లపై ఓ సాంగ్‌ ఉంటుందట. ఆ సాంగ్‌లో ఫిమేల్‌ వాయిస్‌ను ఆలియాభట్‌ పాడనుంది.

ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఆలియా భట్‌ హిందీ వెర్షన్‌ పాటను మాత్రమే పాడుతుందట. తెలుగు,తమిళంలో డబ్బింగ్‌ చెప్పినా పాట పాడటానికి ఆలియా ఒప్పుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్‌ల మ‌ధ్య సాంగ్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. అలాగే కీలక స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రిస్తార‌ట‌. దీంతో మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన‌ట్లే అవుతుంద‌ట‌. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగానే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌బోతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz