close
Choose your channels

200 మందితో ఆలియా భట్ భారీ సాంగ్‌

Wednesday, February 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

200 మందితో ఆలియా భట్ భారీ సాంగ్‌

ఆలియా భ‌ట్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గంగూభాయ్ క‌తియావాడి’. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్ లీలా భ‌న్సాలి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముంబైలోని కామ‌త్‌పుర అనే ప్రాంతంలో లేడీడాన్‌గా పేరు పొందిన గంగూబాయ్ జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం సంజ‌య్ భారీ సాంగ్‌ను ప్లాన్ చేశార‌ట‌. సాధార‌ణంగా సంజ‌య్ లీలా భ‌న్సాలి సినిమాలో భారీత‌నం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. సాంగ్స్‌, సెట్స్ ఇలా అన్నీట ఆయ‌న భారీత‌నంలో సినిమాను తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. అలాంటి భారీ సాంగ్‌ను గంగూభాయ్ క‌తియావాడిలోనూ ప్లాన్ చేశాడ‌ట సంజ‌య్ లీలా భ‌న్సాలి.

200 మంది డాన్స‌ర్స్‌తో భారీ పాట‌ను హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఓ ప్ర‌త్యేక‌మైన సెట్‌ను వేసి చిత్రీక‌రించ‌బోతున్నాడ‌ట‌. ఈ సాంగ్ కోసం ఆలియా భ‌ట్ కాస్త గ్యాప్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తుంద‌ట‌. అందు కోసం రెండు వారాల పాటు ఆలియా భ‌ట్ డాన్స్ ప్రాక్టీస్ చేయ‌నుంద‌ట‌. కోవిడ్ కారణంగా ఆలస్యమైన షూటింగ్‌ను మార్చి నాటికంతా చిత్రీకరణను పూర్తి చేయాలనేది సంజయ్ లీలా భన్సాలి ప్లాన్. ఇప్పటికే ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుతో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.