'ఆర్ఆర్ఆర్‌' లో ఆలియా భ‌ట్ స‌ర్‌ప్రైజ్‌..!

  • IndiaGlitz, [Sunday,February 14 2021]

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). మార్చి నెలనాటికంతా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌నే ప్లానింగ్‌తో జ‌క్క‌న్న షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఓ సాంగ్ ఉంటుంది.. ఆ సాంగ్‌లో ఫిమేల్‌ వాయిస్‌ను ఆలియాభట్ పాడుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఆలియా భట్‌ హిందీ వెర్షన్‌ పాటను మాత్రమే పాడుతుందట. తెలుగు,తమిళంలో డబ్బింగ్‌ చెప్పినా పాట పాడటానికి ఆలియా ఒప్పుకోలేద‌ని టాక్‌.

దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగానే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌బోతున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని, ఒలివియా మోరిస్‌, శ్రియా శ‌ర‌న్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

More News

డేట్ ఫిక్స్ చేసుకున్న 'రాధేశ్యామ్'

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ `రాధేశ్యామ్` విడుద‌ల‌ గురించి ఆయ‌న అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌నే సంగ‌తి అందరికీ తెలిసిందే.

వసూళ్ల ‘ఉప్పెన’ కొనసాగిస్తున్న మెగా హీరో

చిరంజీవి చిన్న మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’.

'విక్రమ్' టీజర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు బాబి

'విక్రమ్' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ప్రముఖ దర్శకుడు బాబి వ్యక్తంచేశారు.

రాధేశ్యామ్’ గ్లింప్స్: ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు, నేనా టైప్ కాదు

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్‌. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తోంది.

అనిరుథ్‌తో కీర్తి సురేష్ పెళ్లంట!

ఇటీవలి కాలంలో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి కామన్‌గానే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే తొలుత కీర్తి సురేష్ పెళ్లి విషయంలో రూమర్స్ రాగా..