కరోనాతో ఐసీయూలో .. రెండు రోజుల్లో నా శవానికి మంట పెట్టేస్తారనుకున్నా: రాజశేఖర్ కంటతడి

  • IndiaGlitz, [Saturday,January 08 2022]

2019 చివరిలో చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి మనిషిని నాలుగు గోడల మధ్య బందీని సంగతి తెలిసిందే. దీని వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను, ఆత్మీయులను కోల్పోయారు. ఇక ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై.. కోట్లాది మంది బతుకులు రోడ్డునపడ్డారు. సామాన్యుల నుంచి అపర కుబేరులు సైతం కోవిడ్ నుంచి తప్పించుకోలేకపోయారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దీని బారినపడి చావు అంచులదాకా వెళ్లొచ్చారు. వీరిలో యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ కూడా ఒకరు. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఆయన పరిస్ధితి విషమించి .. ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో రాజశేఖర్ ఆరోగ్యంపై ఎన్నో వదంతులు వచ్చాయి. అయితే అభిమానుల ప్రార్ధనలు ఫలించి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కమెడియన్ అలీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అలీ 360 టాక్ షోలో కోవిడ్ బారినపడటం, చికిత్స, ఆ సమయంలో అనుభవించిన మానసిక క్షోభను రాజశేఖర్ అభిమానులతో పంచుకున్నారు.

'ఆలీతో సరదాగా' టాక్ షోకు రాజశేఖర్, జీవిత దంపతులు గెస్ట్‌లుగా వచ్చారు. ఓ వారంలో 'శేఖర్' సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందనగా. రాజ‌శేఖ‌ర్‌కు కరోనాగా తేలిందని.. అప్పుడు ఆయన ఓ నెలపాటు ఐసీయూలో ఉన్నారని జీవిత తెలిపారు. సీరియస్ అయ్యి... మనం చచ్చిపోతాం.. రేపో, ఎల్లుండో మనల్ని మంట పెట్టేస్తారని అనుకున్నా అని రాజశేఖర్ ఉద్వేగానికి గురయ్యారు. భర్తను చూసి జీవిత సైతం కంటతడి పెట్టారు. ఇక మీకు ‘నట వారసులు ఉంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా’ అని ఆలీ ప్రశ్నించగా ‘నాకు చాలాసార్లు అనిపించింది. కానీ, కుదరలేదు’ అని రాజశేఖర్‌ నవ్వుతూ చెప్పారు. రాజశేఖర్‌ తనని కుట్టి అని ముద్దుగా పిలుస్తారని జీవిత చెప్పుకొచ్చారు.

'మీరు డాక్టర్ చదివారు కదా! ఎందుకు యాక్టర్ అవ్వాలని అనుకున్నారని.. రాజ‌శేఖ‌ర్‌ను ఆలీ ప్ర‌శ్నించారు. ఎప్పుడు ఎగ్జామ్స్ కోసం చదువుతానో... అప్పుడు యాక్టర్ అవ్వాలని అనిపించేదని బదులిచ్చారు. తనకు నత్తి అని.. దర్శకుడినో, నిర్మాతనో కలిసి నాకు అవకాశం ఇవ్వమని అడిగిన తర్వాత, నత్తి వల్ల నన్ను తీసేస్తేనని ఆలోచించా అంటూ రాజశేఖర్ సమాధానం ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే రాజశేఖర్ నటిస్తున్న 91వ చిత్రం శేఖర్. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘‘జోసెఫ్’’కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ‘‘శేఖర్’’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌‌కే మంచి రెస్పాన్స్ వచ్చింది.

More News

సస్పెన్స్‌కు తెర.. ఉద్యోగులకు 23 శాతం పీఆర్‌సీ ప్రకటించిన జగన్

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించింది.

భార్యకు కరోనా, ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన్‌లో... అయినా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌

దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు.

కోరలు చాస్తున్న కరోనా.. బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు పాజిటివ్

దేశంలో కోవిడ్ ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. ఇవాళ కొత్త కేసుల సంఖ్య లక్ష దాటేసింది.

వనమా రాఘవ అరెస్ట్ అయ్యాడా.. లేదా... కొనసాగుతున్న సస్పెన్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవేంద్ర రావు అరెస్ట్ అయ్యాడా

నుమాయిష్‌పై కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఈ ఏడాది కూడా పూర్తిగా రద్దు, నాంపల్లి సొసైటీ కీలక ప్రకటన

దేశంలో కరోనా , ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.