close
Choose your channels

సమరానికి సర్వం సిద్ధం...

Wednesday, April 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సమరానికి సర్వం సిద్ధం...

ఏపీలో ఎన్నికల సమరం నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ఏప్రిల్ 11న జరిగే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందిభి మోగించేందుకు పార్టీలు సమాయత్తం అయ్యాయ్. ఇప్పటికే ప్రచార పర్వం ముగియగా.... పోలింగ్ సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు... ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంది.

గురువారం రోజు జరిగే ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై .. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగియనుంది. ఐతే ఉదయం ఐదున్నర గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభమవుతుందని .. పోలింగ్ ఏజెంట్లు ఆ టైమ్ కు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసేందకు ... ఎన్నికల ప్రక్రియను వివరించేందుకు 50 మంది ఓటర్లతో మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఏజెంట్లు ఆ టైంకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నా.. చేరుకోకపోయినా... మాక్
పోలింగ్ జరుగుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మూడు కోట్ల 93 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించనున్నారు. 2, 118 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 319 మంది ఎంపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికల కోసం మొత్తం 45, 920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ.... 9వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపిన ఈసీ .... 85 శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేసింది.

ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకునేందుకు మందు, మనీ సరఫరా చేసేందుకు రాజకీయ నాయకులు చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు... రాష్ట్ర వ్యాప్తంగా 118.89 కోట్ల నగదు, రూ.24.15 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. కాగా మద్యం, డబ్బు పట్టివేతలో ఏపీనే మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, కెమెరాలను నిషేధించినట్లు తెలిపారు. ఓటు వేసినట్లు ఫోటోలు తీసిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.