అల్ల‌రి న‌రేష్ మ‌ర‌చిపోలేని రోజు ఇది

  • IndiaGlitz, [Tuesday,May 10 2016]

అల్ల‌రి చేసినా.. కిత‌కిత‌లు పెట్టినా.. అంతిమంగా ప్రేక్ష‌కుడికి వినోదాన్ని అందించ‌డ‌మే అత‌ని ప‌ని. ఆ అత‌ను మ‌రెవ‌రో కాదు 'అల్ల‌రి'తో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మై ఆ అల్ల‌రిని ఇంటిపేరుగా మార్చుకున్న అల్ల‌రి న‌రేష్‌. ఇత‌డి తొలి చిత్రం 'అల్ల‌రి' విడుద‌లై నేటి (మే 10)తో 14 ఏళ్లు పూర్త‌వుతోంది.

ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన 'అల్ల‌రి'.. న‌రేష్ కెరీర్‌కి శుభారంభాన్నివ్వ‌డ‌మే కాకుండా.. ప‌లు అవ‌కాశాల‌కు వేదిక‌గా నిలిచింది. ఇటీవ‌లే 'మామ మంచు అల్లుడు కంచు'తో 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు. ఇంత‌టి కెరీర్ స్పాన్‌కి కార‌ణంగా నిలిచిన 'అల్ల‌రి' రిలీజైన రోజంటే అల్ల‌రి న‌రేష్‌కి మ‌ర‌చిపోలేని రోజే మ‌రి. ప్ర‌స్తుతం ఈశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నాడు న‌రేష్.

More News

క్లైమాక్స్‌లో ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి'

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించి క్లైమాక్స్‌ చిత్రీకరణ శంషాబాద్‌ టెంపుల్‌లో జరుగుతోంది.

జనతాగ్యారేజ్ ఆడియో రిలీజ్ డేట్...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తాగ్యారేజ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ ఎన్టీఆర్ పెద్ద‌నాన్న పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. స‌మంత‌, నిత్యామీన‌న్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

మే 30న 'కబాలి' ఆడియో

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది.

మే 13న రిలీజ్‌కి సిద్ధమవుతున్న 'పెన్సిల్‌'

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్‌, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్‌ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'పెన్సిల్‌'.

పవన్ ని తెర పై అలా చూడగలరా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.