close
Choose your channels

అల్ల‌రి న‌రేశ్ కొత్త ప్ర‌య‌త్నం.. రీ ఎంట్రీ అనుకోవాలా?

Monday, January 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్ల‌రి న‌రేశ్ కొత్త ప్ర‌య‌త్నం.. రీ ఎంట్రీ అనుకోవాలా?

నేటి త‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు అల్ల‌రి న‌రేశ్‌. త‌న‌దైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాల‌తో చాలా త్వ‌ర‌గా 50 సినిమాల‌ను చాలా త్వ‌ర‌గా పూర్తి చేసుకున్న అల్లరి న‌రేశ్‌కి హీరోగా ఈమధ్య హిట్ లేనే లేదు. రీసెంట్‌గా అల్ల‌రి న‌రేశ్ న‌టించిన చిత్రం మ‌హ‌ర్షి. ఆ సినిమా విజ‌యం క్రెడిట్ ఎవ‌రి సొంత‌మైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హీరోగా స‌క్సెస్ కొట్టాలంటే నేటి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గిన‌ట్టుగా కొత్త‌ద‌నం ఉన్న సినిమాలు చేయాల‌ని అనుకున్న న‌రేశ్ రూట్ మార్చాడు.

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా కొత్త సినిమాను ప్రారంభించాడు న‌రేశ్‌. ఈ సినిమాకు `నాంది` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పూర్తి గ‌డ్డంతో న‌రేశ్‌ను పోలీస్‌స్టేష‌న్‌లో బ‌ట్టలు లేకుండా వేలాడ‌దీసి ఉన్నారు. ఈలుక్ చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారందరూ ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేశ్ చూసిన గెట‌ప్స్‌వేరు.. ఈ లుక్ వేరు. ప‌క్కా సీరియ‌స్ మూవీ అని పోస్ట‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌రి టైటిల్‌కు త‌గిన‌ట్లు అల్ల‌రి న‌రేష్ కొత్త‌ద‌నానికి నాంది ప‌లుకుతాడేమో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.