అల్ల‌రి న‌రేశ్ కొత్త ప్ర‌య‌త్నం.. రీ ఎంట్రీ అనుకోవాలా?

  • IndiaGlitz, [Monday,January 20 2020]

నేటి త‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు అల్ల‌రి న‌రేశ్‌. త‌న‌దైన కామెడీ టైమింగ్ ఉన్న సినిమాల‌తో చాలా త్వ‌ర‌గా 50 సినిమాల‌ను చాలా త్వ‌ర‌గా పూర్తి చేసుకున్న అల్లరి న‌రేశ్‌కి హీరోగా ఈమధ్య హిట్ లేనే లేదు. రీసెంట్‌గా అల్ల‌రి న‌రేశ్ న‌టించిన చిత్రం మ‌హ‌ర్షి. ఆ సినిమా విజ‌యం క్రెడిట్ ఎవ‌రి సొంత‌మైందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హీరోగా స‌క్సెస్ కొట్టాలంటే నేటి ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గిన‌ట్టుగా కొత్త‌ద‌నం ఉన్న సినిమాలు చేయాల‌ని అనుకున్న న‌రేశ్ రూట్ మార్చాడు.

విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా కొత్త సినిమాను ప్రారంభించాడు న‌రేశ్‌. ఈ సినిమాకు 'నాంది' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పూర్తి గ‌డ్డంతో న‌రేశ్‌ను పోలీస్‌స్టేష‌న్‌లో బ‌ట్టలు లేకుండా వేలాడ‌దీసి ఉన్నారు. ఈలుక్ చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారందరూ ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు న‌రేశ్ చూసిన గెట‌ప్స్‌వేరు.. ఈ లుక్ వేరు. ప‌క్కా సీరియ‌స్ మూవీ అని పోస్ట‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌రి టైటిల్‌కు త‌గిన‌ట్లు అల్ల‌రి న‌రేష్ కొత్త‌ద‌నానికి నాంది ప‌లుకుతాడేమో వేచి చూడాలి.

More News

ఫైట‌ర్ స్టార్ట్‌... బాలీవుడ్ హీరోయిన్‌తో రొమాన్స్‌

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

మా నాన్నతో కలిసి మొదటిసారి ఇండస్ట్రీ రికార్డ్ కొడుతున్నాను: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది.

ఆక్ట‌టుకుంటోన్న బాల‌కృష్ణ స‌రికొత్త లుక్‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

కేరళలో 'విరాటపర్వం' షూటింగ్‌ లో రానా

హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం 'విరాటపర్వం' షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

ఆమెను మ‌రోసారి విల‌క్ష‌ణ పాత్ర‌లో ప్రెజెంట్ చేయ‌నున్న సుకుమార్‌

`రంగ‌స్థ‌లం` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ సుకుమార్ మ‌రో సినిమాను తెర‌కెక్కించ‌లేదు. బ‌న్నీతో సినిమా చేయ‌డానికి ఎదురు చూస్తున్నాడు.