విశాల్ గోడలు దూకే రకం కాదు
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్ అంత మంచి వ్యక్తి కాడనీ, అతనికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని, ఆమెకోసం విశాల్ గోడలు దూకేవాడని విశ్వదర్శిని అనే మహిళ చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేలింది. చెన్నై రాయపేటకు చెందిన విశ్వదర్శిని అనే మహిళ విశాల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపాయి. తమ పక్కింటి అమ్మాయి కోసం విశాల్ గోడలు దూకడాన్ని తాను చాలా సార్లు చూశాననీ, ఈ విషయం గురించి అమ్మాయి తల్లి పలుమార్లు విశాల్‌ను మందలించిందని కూడా ఆమె చెప్పారు.
అయితే అందులో నిజం లేదని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ఆ మహిళకు పక్కింటి వాళ్లతో ఎన్నాళ్లుగానో గొడవలు ఉన్నాయని, దాని కోసమే వారిని అన్ పాపులర్ చేయడానికి విశాల్ పేరును వాడుకున్నారని ఆ విచారణలో తేలింది. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆ మహిళ కొన్నాళ్ల కిందట అదృశ్యమైంది. ఆమెను తిరుచెంగోడులో పోలీసులు అరెస్ట్ చేశారు. విశాల్ గోడలు దూకే రకం కాదని నిర్ధారించారు. విశాల్‌కు ఆల్రెడీ నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.