న్యూడ్ పార్టీలు, సెక్సువల్ రిలేషన్ షిప్స్.. బిల్ గేట్స్ అసలు రంగు ఇదే!

గత నెలలో తామిద్దరం విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అతడి భార్య మిలిందా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఒక్కరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాదాపు 27 ఏళ్ల బంధానికి వీరిద్దరూ తెరదించారు. ఈ ప్రకటన తర్వాత బిల్ గేట్స్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ గేట్స్ గురించి సంచలన కథనం ప్రచురించింది. సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ లో రాబట్టిన సమాచారం మేరకు గేట్స్ అసలు రంగు బయటపడ్డట్లు పేర్కొంది. బిల్ గేట్స్ ఉమెనైజర్ అని, కొందరు మహిళా ఉద్యోగులతో ఎఫైర్ పెట్టుకున్నాడని, మరికొందరిని లైంగికంగా వేధించాడని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పిక్ టాక్: బికినీ ఫోజుతో నెట్టింట తుఫాన్ సృష్టించిన బాలయ్య హీరోయిన్

తాను ఒక ఉమెనైజర్ అయినప్పటికీ మీడియా మేనేజ్మెంట్, పిఆర్ టీంతో ఫేక్ క్లీన్ ఇమేజ్ ని కాపాడుకున్నాడని పేర్కొన్నారు. 2019లో ఓ ఉద్యోగి తనకు గేట్స్ తో సెక్సువల్ రిలేషన్ షిప్ ఉందని చెప్పడంతో ఆ ఏడాది కొన్నినెలల పాటు అతడిని బోర్డు నుంచి తప్పించారు.

మైక్రోసాఫ్ట్ సంస్థలో గేట్స్ వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. కానీ అవేమి బయటకు రాకుండా గేట్స్ తన పీఆర్ టీం తో జాగ్రత్త పడ్డాడు. సంస్థలో నిత్యం మహిళలతో ఒంటరిగా మీటింగ్స్ నిర్వహించేందుకు ప్రయత్నించేవాడు. వారిని డిన్నర్ లకు ఆహ్వానించేవాడు.

కొందరు మహిళా ఉద్యోగులు రివీల్ చేసిన సమాచారం మేరకు బిల్ గేట్స్ న్యూడ్ పార్టీలు నిర్వహించేవాడని కూడా బయటపడింది. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న మహిళా ఉద్యోగులు కూడా అతడిని ఒంటరిగా మీట్ అయ్యేందుకు భయపడేవారు. గేట్స్ గురించి తెలిసి తాను అతడితో మీటింగ్స్ అవాయిడ్ చేసేదాన్ని అని తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో గేట్స్ వుమెనైజర్ అని తనకు ముందే తెలుసు అని మిలిందా పేర్కొందట. తనతో డేటింగ్ లో ఉన్నప్పటికీ గేట్స్ పూర్తిగా కమిట్మెంట్ తో ఉండేవారు కాదు. అతడికి వేరే రొమాంటిక్ ఆలోచనలు ఉండేవి అని మిలిందా పేర్కొంది. కానీ పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఆసక్తి చూపేవాడు.

ఓ మహిళా ఉద్యోగికి ఈమెయిల్ ద్వారా డిన్నర్ కి ఆహ్వానించాడట. ఈ సంఘటన 2006లో జరిగింది. మరో మహిళని గేట్స్ కాక్ టైల్ పార్టీకి ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా మిస్టర్ పర్ఫెక్ట్ ముసుగులో గేట్స్ అనేక రాసలీలలు కొనసాగించారని మీడియా సంస్థ బయటపెట్టింది. చాలా మీడియా సంస్థలలోని కీలక వ్యక్తులకు ఈ విషయం తెలిసేది. కానీ గేట్స్ తో కాంట్రాక్టు పోతుందని ఈ విషయాలు ఎవరూ బయట పెట్టలేదని పేర్కొన్నారు.