చిరంజీవినే అంటాడా ... ప్రొడక్షన్ మేనేజర్‌ని 13 కుట్లు పడేలా కొట్టిన అల్లు అరవింద్, ఏం జరిగిందంటే.?

అల్లు అరవింద్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను ఆయన తెరకెక్కించారు. అంతేకాదు.. ఏ వ్యాపారం మొదలుపెట్టినా అందులో నెంబర్ వన్ కావడం ఆయన మేధస్సుకు, కృషి, పట్టుదలకు నిదర్శనం. కేవలం సినిమాలే కాకుండా ఎన్నో వ్యవహారాలను అల్లు అరవింద్ చక్కబెడుతున్నారు. ఇండస్ట్రీతో పాటు మెగా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా వున్నారు. అయితే అల్లు అరవింద్ పైకి కనిపించేంత సాఫ్ట్ కాదట. కాలేజ్ రోజుల్లో కానీ.. ఇప్పుడు కానీ ఆయన వెనుక పదిమంది వుండాల్సిందేనట. అంతేకాదు అప్పట్లో ఆయన చేతుల్లో తన్నులు తిన్న ఓ వ్యక్తికి 13 కుట్లు పడ్డాయంటే అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలీ హోస్ట్‌గా... ఈటీవీలో ప్రసారమవుతోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్‌గా అల్లు అరవింద్ వచ్చారు. రెండు భాగాలుగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా తన బావమరిది, మెగాస్టార్ చిరంజీవితో వున్న అనుబంధాన్ని.. మద్రాస్ నగరంలో తన కాలేజ్ డేస్‌, నిర్మాతగా తొలి రోజులను షేర్ చేసుకున్నారు అల్లు అరవింద్.

చిరంజీవి బంధువు కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్ :

చిరంజీవిని బంధువుగా కంటే మిత్రుడిగా తాను చాలా ఇష్టపడతానని చెప్పారు అరవింద్. పైగా చెల్లెలి భర్త కావడంతో ఆయనంటే గౌరవం, ప్రేమ అని అలాంటిది చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకి మామూలుగా వుండేది కాదని పేర్కొన్నారు. అలా ఓ గొడవ గురించి ప్రస్తావించారు అల్లు అరవింద్. అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్‌ను కొడితే అతనికి 13 కుట్లు పడ్డాయని తెలిపారు. అసలు ఆ గొడవకు దారి తీసిన కారణమేంటంటే..?

అతను తాగితే మనిషి కాదు:

అప్పట్లో చిరంజీవి డేట్స్ చూసేందుకు ఓ ప్రొడక్షన్ మేనేజర్ వుండేవారని.. కానీ ఆయన మద్యం సేవిస్తే మాత్రం వెనుకాముందు చూసుకోకుండా మాట్లాడేసేవారని అరవింద్ చెప్పారు. అలా చిరంజీవిని కూడా డ్రింక్ చేసి అమర్యాదగా మాట్లాడుతుంటే.. తాను చాలా సార్లు చెప్పిచూశానని, కానీ ఓ సారి దేవీ థియేటర్‌లో తాను.. చిరంజీవి సహా చాలా మంది పెద్దలందరం కలిసి సినిమా చూస్తున్నట్లు తెలిపారు అరవింద్. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రొడక్షన్ మేనేజర్ మందు తాగి వచ్చి.. చిరంజీవిని పిలవ్వయ్యా మాట్లాడాలంటూ అసభ్యకరంగా మాట్లాడాడని, తాను అతనిని కారు ఎక్కించే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా తనను తోసేశాడని అరవింద్ తెలిపారు.

చిరంజీవి కొట్టుంటే విషయం పెద్దదయ్యేది:

అతని తీరుతో తనకు బాగా కోపం వచ్చి.. చేతికున్న వాచీ, కళ్లజోడు తీసేసి సదరు ప్రొడక్షన్ మేనేజర్‌ను కాలర్ పట్టుకుని బయటకు లాక్కొచ్చి కొట్టానని, అతనికి 13 కుట్లు పడ్డాయని పేర్కొన్నారు. ఒకవేళ అప్పుడు తాను అలా కొట్టకపోయుంటే.. చిరంజీవి చేతుల్లో దెబ్బలు పడేవి... ఆయన కొట్టుంటే విషయం చాలా పెద్దదయ్యేదని అరవింద్ తెలిపారు. తాను ఎవరినైనా ఇష్టపడితే ఇలాగే వుంటుందని చెప్పారు. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా సేపు బాధపడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

More News

దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా "స్లమ్ డాగ్ హజ్బెండ్" ఫ్రస్టేషన్ సాంగ్ రిలీజ్

సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న కామికల్ ఎంటర్ టైనర్ సినిమా "స్లమ్ డాగ్ హజ్బెండ్".

Pawan Kalyan : ఎన్నికలకు ఎలా వెళ్లాలి.. ఒక్క రోజులో తేల్చలేం : చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని

Geetha Arts : ‘‘గీత’’ అంటే నా గర్ల్‌ఫ్రెండ్ అనుకుంటున్నారు.. బ్యానర్‌ పేరు వెనుక కథ ఇదే : అల్లు అరవింద్

తెలుగు చలనచిత్ర పరిశ్రమను శాసిస్తోన్న నలుగురిలో ఒకరు అల్లు అరవింద్. ఇక దేశంలోని బడా నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి.

BiggBoss: మీ అంత వేస్ట్‌గాళ్లు ఏ సీజన్‌లో లేరు.. బయటకు పోండి , కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఆగ్రహం

గత సీజన్‌లతో పోలిస్తే బిగ్‌బాస్ 6 ప్రజల్ని ఏమాత్రం ఆకట్టుకోవడం లేదన్న సంగతి తెలిసిందే.

అల్లు అరవింద్‌ని ఆ వయసులో చెంపదెబ్బ కొట్టిన అల్లు రామలింగయ్య.. ఏం జరిగింది..?

సాధారణంగా ప్రతి తల్లీదండ్రులు తమ పిల్లలను గాడిలో పెట్టేందుకు , తప్పు చేస్తే దండించేందుకు చేయి చేసుకోవడం అనేది