close
Choose your channels

అది చూసిన తర్వాత కిక్ ఇచ్చింది అందుకే యుఎస్ ఎలో ధృవ ప్రీమియర్ - అల్లు అరవింద్

Friday, November 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ‌. ఈ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, ఎన్.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను ప్ర‌సాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేసారు.
ఈ సంద‌ర్భంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... ధృవ చిత్రాన్ని డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేయాలి అనుకున్నాం. అయితే...నోట్ల ర‌ద్దు వ‌ల‌న థియేట‌ర్స్ కి ప్రేక్ష‌కులు వ‌చ్చి సినిమా చూస్తారా అనే సందేహం వ‌చ్చింది. దీంతో ఈ విష‌యం పై రీసెర్చ్ చేయిస్తే 9వ తారీఖున అయితే బాగుంటుంది జ‌నం ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉంటాయి అని తేలింది. అందుచేత ధృవ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే...ఈ ట్రైల‌ర్ ను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో రిలీజ్ చేయాలి అనుకున్నాం. అయితే...ట్రైల‌ర్ చూసాకా అప్ప‌టి వ‌ర‌కు ఆగ‌డం ఎందుకు ఈలోపే జ‌నంలోకి ఈ ట్రైల‌ర్ పంపించేయాలి అని ఈరోజు ట్రైల‌ర్ ను రిలీజ్ చేసాం.
త్వ‌ర‌లో వైజాగ్, తిరుప‌తి, విజ‌య‌వాడ కూడా వెళ్లి ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ చేయాలి అనుకుంటున్నాం. యు ఎస్ ఎ ప్రీమియ‌ర్ కి యూనిట్ వెళ్ల‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ విష‌యం చెబితే డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి సినిమా పై మీకు అంత కాన్ఫిడెన్సా అన్నాడు. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అంత కిక్ ఇచ్చింది అని చెప్పాను. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ డిసెంబ‌ర్ 4న గ్రాండ్ గా చేస్తున్నాం. ఈ ఫంక్ష‌న్ కి గెస్ట్ లు ఎవ‌రు అనేది త్వ‌ర‌లో తెలియ‌చేస్తాం అన్నారు.
నిర్మాత ఎన్.వి.ప్ర‌సాద్ మాట్లాడుతూ... చిరంజీవి గారితో ఖైదీ సినిమా అప్ప‌టి నుంచి ప‌రిచ‌యం. అలాగే అర‌వింద్ గారితో 30 ఏళ్ల అనుబంధం. స్ర్కీన్ పై ఆయ‌న పేరు ప‌క్క‌న నా పేరు చూసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. చ‌ర‌ణ్ ఫ్యాన్స్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమాతో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ త‌లెత్తుకుంటారు. ధృవ గొప్ప చిత్రం... అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.
డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.... అంద‌రిలాగే నేను కూడా ధృవ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. టీమ్ అంతా చాలా క‌ష్ట‌ప‌డ్డాం. మా అంద‌రి కంటే ఎక్కువ చ‌ర‌ణ్ క‌ష్ట‌ప‌డ్డాడు. నాకు అవ‌కాశం ఇచ్చిన అల్లు అర‌వింద్ గార్కి, ఎన్.వి.ప్ర‌సాద్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... గీతా ఆర్ట్స్ లో నాకు ఇది రెండో సినిమా. అలాగే చ‌ర‌ణ్ తో రెండో సినిమా. డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో కూడా రెండో సినిమా. సో....ఈ సినిమా నాకు చాలా స్పెష‌ల్. త‌మిళ్ లో నా ఫేవ‌రేట్ మూవీ త‌ని ఓరువ‌న్. ఈ సినిమాని తెలుగులో ఎవ‌రైనా రీమేక్ చేస్తారా....అనుకున్నాను. నేను అనుకున్న‌ట్టుగానే రీమేక్ చేయ‌డం... ఇందులో నాకు అవ‌కాశం రావ‌డం చాలా ల‌క్కీగా ఫీల‌వుతున్నాను. ఈ సినిమాలో స్ర్కీన్ ప్లే చాలా కొత్త‌గా ఉంటుంది. చ‌ర‌ణ్ లుక్ చాలా కొత్త‌గా ఉంటుంది. అంద‌రికీ ధృవ న‌చ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.