బన్నీ కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?

  • IndiaGlitz, [Tuesday,April 07 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే కాలేదు. అందుకు కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌రోనా వైర‌స్‌. దీంతో ముందు కేర‌ళ‌లో అనుకున్న షూటింగ్ గోదావ‌రి జిల్లాల్లో అనుకున్నారు. తీరా ఇప్పుడు ఆల‌స్యంగా సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. కాగా.. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రేపు బన్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే..ఈ సినిమా టైటిల్‌గా పుష్ప అని ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. సినిమాలో బ‌న్నీ పేరు పుష్ప‌క్ నారాయ‌ణ్‌. దాంట్లో నుండే టైటిల్‌ను ఖ‌రారు చేశార‌ని టాక్‌. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. శేషాచ‌లం అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సుకుమార్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం బ‌న్నీ చిత్తూరు జిల్లా యాస‌ను నేర్చుకున్నాడ‌ట‌.

More News

భారత్ పెద్ద మనసు: ఎట్టకేలకు అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్..

అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కొవిడ్-19పై సమాచారం కోసం వాట్సాప్ చాట్ బోట్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భూతంపై పోరాటంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 నివారణా చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన

మేం అడిగితే ఇవ్వరా.. భారత్‌పై ప్రతీకారం ఉండొచ్చు: ట్రంప్

కరోనా వైరస్‌పై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కాస్త వర్కవుట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇండియాలో మెండుగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి..

క‌రోనా పై యుద్ధానికి ఆదిత్య మ్యూజిక్ 31 ల‌క్ష‌ల విరాళం

క‌రోనా మ‌హ్మ‌మారి రోజురోజుకి విజృభిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేశ ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా ప్ర‌భావం