close
Choose your channels

బాలీవుడ్ ఎంట్రీ గురించి బ‌న్నీ ఏమ‌న్నాడో తెలుసా?

Tuesday, February 4, 2020 • తెలుగు Comments

బాలీవుడ్ ఎంట్రీ గురించి బ‌న్నీ ఏమ‌న్నాడో తెలుసా?

`బాహుబ‌లి`, `కె.జి.య‌ఫ్ పార్ట్ 1` చిత్రాల త‌ర్వాత ద‌క్షిణాది చిత్రాల‌కు బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. `సాహో`, `సైరా`, `ప‌హిల్వాన్‌`, `అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ` వంటి ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాణించాల‌నుకున్న మేర‌కు రాణించలేక ఊసుర‌మ‌నిపించాయి. అయితే కూడా ఇప్పుడు ప‌లు సౌత్ సినిమాలు బాలీవుడ్‌పై దండ‌యాత్ర‌లు చేయ‌డం స్టార్ట్ చేశాయి. ఈ క్ర‌మంలో తెలుగులో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్‌లో `ఆర్ఆర్ఆర్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్ అడుగుపెడుతుంటే చ‌ర‌ణ్‌కు రీఎంట్రీ అనాలేమో. అయితే మ‌హేశ్‌, బ‌న్నీ మాత్రం బాలీవుడ్ ఎంట్రీ కోసం వేచి చూస్తున్నారు.

బాలీవుడ్ ఎంట్రీ గురించి బ‌న్నీ ఏమ‌న్నాడో తెలుసా?

రీసెంట్ టైమ్స్‌లో బ‌న్నీ బాలీవుడ్ ఎంట్రీపై వార్త‌లు వినిపించాయి. దీనిపై రీసెంట్ ఇంట‌ర్వ్యూలో బ‌న్నీ స్పందిస్తూ `` ఈ ఏడాది `అల వైకుంఠ‌పుర‌ములో`తో స‌క్సెస్ అందుకున్నాను. త‌ర్వాత సుకుమార్ సినిమా చేస్తున్నాను. మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్ర‌య‌త్నం చేయాలి. నేను తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 16 ఏళ్లు అయ్యింది. కానీ.. బాలీవుడ్‌లోకి డెబ్యూ అన‌గానే నాకు కొత్త పరిశ్ర‌మే అవుతుంది. రాజ్‌కుమార్ హీరాణి, సుజిత్ సిర్కార్‌, ఆనంద్ ఎల్‌.రాయ్‌, సంజ‌య్ లీలా భ‌న్సాలీ వంటి ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాను``అని తెలిపారు అల్లు అర్జున్‌.

Get Breaking News Alerts From IndiaGlitz