close
Choose your channels

'ఎవరు' తో శేష్ హ్యాట్రిక్ కొట్టేశాడు: బన్నీ

Monday, August 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎవరు తో శేష్ హ్యాట్రిక్ కొట్టేశాడు: బన్నీ

క్షణం, గూఢచారి చిత్రాల తర్వాత అడివిశేష్, ఎవరు`తో హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని బన్నీ కూడా అంగీకరించాడు. `ఎవరు` సినిమాను చూసిన స్టైలిష్ స్టార్ సినిమాకు ఫిదా అయ్యాడు. ఎంతలా అంటే వెంటనే `ఎవరు` యూనిట్‌ను అభినందిస్తూ ట్వీట్ కూడా పెట్టేశాడు.

``ఎవరు సినిమాను రాత్రే చూశాను. ట్విస్టులు, టర్న్‌లతో సినిమా ఈ అమేజింగ్ మర్డర్ మిస్టర్ నన్ను ఆకట్టుకుంది. సినిమా చాలా బాగా నచ్చింది. రైటింగ్ పరంగానే కాదు.. టెక్నికల్ అంశాల పరంగా కూడా సినిమా బావుంది. వరుస విజయాలను సాధిస్తున్న శేష్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాడు. అలాగే రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర, మురళీశర్మ సహ ఇతర నటీనటులు చక్కగా నటించారు. పీవీపీగారికి, వెంకట్ రామ్‌జీగారికి అభినందనలు`` అన్నారు అల్లు అర్జున్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.