close
Choose your channels

యూరప్‌కు బన్నీ

Monday, November 4, 2019 • తెలుగు Comments

యూరప్‌కు బన్నీ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్‌ బన్నీ యూరప్‌ వెళుత్నునారా? అంటే అవుననే సమాధానం ఆయన సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తుంది. మరి బన్నీ ఏదైనా వెకేషన్‌ కోసం యూరప్‌ వెళుతున్నారా? అని అనుకుంటే మాత్రం పొరపడ్డట్టే. బన్నీ సాంగ్‌ చిత్రీకరణ కోసం యూరప్‌ వెళుతున్నారు. ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అల...వైకుంఠపురములో...’.  ప్రస్తుతం సినిమా చివరి దశ చిత్రీకరణకు చేరుకుంది.  డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ పాటల చిత్రీకరణను ప్లాన్‌ చేశారు. ఇప్పటికే ‘రాములో..రాముల..’ సాంగ్‌ను ఐదుకోట్ల రూపాయల భారీ ఖర్చుతో సెట్‌ వేసిచిత్రీకరించారట.

ఇప్పుడు మరో పాటను ఫారిన్‌లో చిత్రీకరించాలనుకుంటున్నారట. అందులో భాగంగానే యూనిట్‌ ఫ్రాన్స్‌లో ఓ పాటను చిత్రీకరించనున్నారట. అయితే ఇప్పటికే విడుదలైన  రెండు లిరికల్‌ సాంగ్స్‌ మాత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరాం, మురళీశర్మ, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz