close
Choose your channels

అల్లు అర్జున్ - కో డైర‌క్ట‌ర్ స‌త్యం ఇష్యూ...

Saturday, July 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు అర్జున్ - కో డైర‌క్ట‌ర్ స‌త్యం ఇష్యూ...

అస‌లేం జ‌రిగిందంటే..? అల్లు అర్జున్ సెట్లో యాటిట్యూడ్ చూపించారా? దీనివ‌ల్ల కో డైర‌క్ట‌ర్ హ‌ర్ట్ అయ్యారా? దీని వల్ల షూటింగ్ ఆగిందా? త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ న‌టిస్తున్న సెట్లో అస‌లేం జ‌రిగింది? ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌. మామూలుగా సీన్ రెడీ అయితే మిగిలిన ఆర్టిస్టుల‌కు అసిస్టెంట్ డైర‌క్ట‌ర్లు ఇన్ ఫార్మ్ చేస్తుంటారు. కానీ హీరోకు మాత్రం కో డైర‌క్ట‌ర్ వెళ్తుంటారు. ఇటీవ‌ల అల్లు అర్జున్ సినిమాకు కూడా అలాగే జ‌రిగింది. సీన్ రెడీగా ఉంద‌ని కో డైర‌క్ట‌ర్ స‌త్యం ఒక‌టికి మూడు సార్లు పిలిచార‌ట అల్లు అర్జున్‌ని. మొద‌టి రెండు సార్లు ఏమీ అన‌ని బ‌న్నీ, మూడో సారి సీన్ పేప‌ర్లు అత‌ని మీద విసిరేశార‌ట‌. దీంతో హ‌ర్ట్ అయిన కో డైర‌క్ట‌ర్ వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోయార‌ట‌. డైర‌క్ట‌ర్స్ అసోసియేష‌న్ లో కంప్ల‌యింట్ కూడా ఇచ్చిన‌ట్టు స‌మాచారం. కానీ త‌మ‌కు దానికి సంబంధించి కంప్ల‌యింట్లు అంద‌లేద‌ని వాళ్లు క్లారిటీ ఇచ్చారు.

నిర్మాత నాగ‌వంశీగానీ, టీమ్ నుంచి ఇంకెవ‌రూ గానీ దీని గురించి ఇప్ప‌టిదాకా బాహాటంగా స్పందించ‌లేదు. త్రివిక్ర‌మ్ మాత్రం హీరో, కో మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి ట్రై చేస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు అస‌లేం జ‌రిగింద‌నేది హీరో త‌ర‌ఫున మ‌రో వాద‌న ఉంది. నిజానికి ఈ ఘ‌ట‌న జ‌రిగిన రోజు అల్లు అర్జున్‌కి ఓ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంద‌ట‌. కానీ షూటింగ్ ముఖ్య‌మ‌నుకుని ఆయ‌న ఆ ప‌నుల‌ను ప‌క్క‌న‌పెట్టి వ‌చ్చార‌ట‌. తీరా సెట్‌కి వ‌చ్చాక ఇంకో సీనియ‌ర్ ఆర్టిస్ట్ డేట్లు దొర‌క‌లేద‌ని, దాని వ‌ల్ల షూటింగ్ ఉండ‌ద‌ని కో డైర్ట‌ర్ వెళ్లి చెప్పార‌ట‌. ఇలాంటి విష‌యాన్ని ముందే చెప్పి ఉంటే తాను క‌చ్చితంగా త‌న ప్లాన్స్ మిస్ అయ్యేవాడిని కాద‌ని బ‌న్నీ అన్న‌ట్టు తెలిసింది. సో షూటింగ్ డిస్ట‌ర్బెన్స్ వ‌ల్ల‌నే బ‌న్నికి కోపం వ‌చ్చింది కానీ, యాటిట్యూడ్ వ‌ల్ల కాద‌ని ఆ వైపు వాద‌న‌. నిజానిజాలు బ‌న్నీకి, కో డైర‌క్ట‌ర్‌కి స‌త్యానికి మాత్ర‌మే తెలుస‌న్న‌ది గ్ర‌హించాల్సిన వాస్త‌వం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.