అల్లు అర్జున్, రానాలు నా ప్రయాణాన్ని అద్భుతం చేశారు: అనుష్క

  • IndiaGlitz, [Friday,October 09 2020]

లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘అరుంధతి’తో మొదలైన అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయాణం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా.. కాకతీయ రాజ్యాధినేత రాణి రుద్రమదేవి జీవితగాథతో తెరకెక్కిన ‘రుద్రమదేవి’లో టైటిల్ రోల్‌ను అనుష్క పోషించిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 9, 2015న విడుదలైంది. అంటే ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు. ఈ సందర్భంగా గుణశేఖర్ సినిమా సాధించిన అద్భుత విజయంలో భాగస్వాములైన వారందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

‘రుద్రమదేవి’ సినిమా తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో హిస్టారికల్‌ త్రీడీ మూవీగా సినిమాను గుణశేఖర్ రూపొందించారు. ఈ చిత్రంలో చాళుక్య వీరభద్రుడి పాత్రలో రానా దగ్గుబాటి, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటించాడు. తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడి బన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రుద్రమదేవి పాత్రలో అనుష్క అద్భుత నటన, గోనగన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్స్‌, రానా ధీరత్వం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి.

ఓ కీలక పాత్రలో నిత్యా మీనన్ నటించి మెప్పించింది. ఈ సినిమాలోని సాంకేతిక అంశాలకు మంచి ఆదరణ లభించింది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది. అయితే ఈ చిత్రం విడుదలై ఐదేళ్లవుతున్న సందర్భంగా అనుష్క కూడా ట్విట్టర్‌ ద్వారా తన స్పందనను తెలియజేసింది రుద్రమదేవి ప్రయాణం నాకెంతో స్పెషల్‌. అల్లుఅర్జున్‌, రానా దగ్గుబాటి ఈ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మలిచారు. ఈ గొప్ప చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన గుణశేఖర్‌, ఆయన టీమ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు అని అనుష్క ట్వీట్ చేసింది.

More News

తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల నుంచీ 'ఎక్స్‌పైరీ డేట్‌'కి మంచి స్పందన లభిస్తోంది! - మధు షాలిని

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

జగన్ కేసుల విచారణ సోమవారానికి వాయిదా

ఏపీ ముఖ్యమంతి జగన్ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో శుక్రవారం జరిగింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ

ప్రభాస్‌ 21లో బిగ్‌ బి

ప్యాన్‌ ఇండియా స్టార్‌ పభాస్‌ 21వ సినిమా రేంజ్‌ పెరుగుతూ వస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మాతగా 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.

టీఆర్పీ స్కాంలో రిపబ్లిక్ టీవీ

ముంబైలో టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్ల(టీఆర్‌పీ) స్కాంను పోలీసులు బట్టబయలు చేశారు. టీవీ రేటింగ్‌లను నిర్ణయించే బార్క్‌ (బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌) తరఫున మీటర్ల మానిటరింగ్‌

కెప్టెన్‌గా సొహైల్.. మోనాల్‌ విషయంలో స్ట్రాంగ్‌గా అఖిల్ ఫిక్స్

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ డిజైన్ చేసిన వారి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అలా వెరైటీగా డిజైన్ చేశారు. ఇక కెప్టెన్సీని సొహైల్ దక్కించుకున్నాడు.