close
Choose your channels

‘అల..’ సక్సెస్.. డైరెక్టర్స్‌కు బన్నీ గ్రాండ్ పార్టీ

Monday, February 3, 2020 • తెలుగు Comments

‘అల..’ సక్సెస్.. డైరెక్టర్స్‌కు బన్నీ గ్రాండ్ పార్టీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విజయవంతంగా ఇప్పటికీ రన్ అవుతుండగా.. మరోవైపు కలెక్షన్ల వర్షం కూడా గట్టిగానే కురుస్తోంది. ఇప్పటికే నాన్ బాహుబలి.. అదీ ఇదీ అంటూ రికార్డ్‌లను మాత్రం తిరగరాసేసింది. సినిమా ఊహించిన దానికంటే సక్సెస్ అవ్వడం.. అది కూడా లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా ఈ రేంజ్‌లో హిట్టవ్వడంతో అల్లు అర్జున్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. ఇందుకు సంబంధించి థ్యాంక్స్ మీట్, సక్సెస్ మీట్ ఇలా అన్ని అయిపోయాయ్.

ఎవరెవరొచ్చారు!?
తాజాగా.. ‘అల..’ విజయాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన నివాసంలో టాలీవుడ్‌ దర్శకులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బన్నీ తండ్రి అల్లు అరవింద్, టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు, కొరటాల శివ, సురేంద్రరెడ్డి, మారుతీ, పరుశురాంతో పాటు పలువురు సీనియర్, జూనియర్ డైరెక్టర్లు విచ్చేశారు. కాగా.. రాఘవేంద్రరావు హాజరుకావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఇలా అందరు డైరెక్టర్స్ ఒక్కచోట కలవడం జరగని పని.. కానీ అల్లు అర్జున్ మాత్రం అది జరిపించి తీరాడు!

అందరికీ థ్యాంక్స్!
కాగా ఈ గ్రాండ్ పార్టీకి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా ఈ సంబరాల్లో పాలుపంచుకునేందుకు మా స్వగృహానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిజంగా ఈ సమావేశం మాకు ఎల్లప్పటికీ ప్రత్యేకం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికీ అందరికి కృతజ్ఞతలు’ అని బన్నీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను బన్నీ అభిమానులు వైరల్ చేస్తుండగా.. కొందరు కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz