మధ్య వయస్కుడిగా బన్ని
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా సెట్స్‌లో ఉన్నా కూడా.. ఆ సినిమా కంటే ఆయన చేయబోయే 21వ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో బన్ని తన 21వ సినిమాగా `ఐకాన్ కనపడుటలేదు`ను చేయబోతున్న సంగతి తెలిసిందే. బన్ని, త్రివిక్రమ్ సినిమా తర్వాతనే బన్ని తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ రానుంది. బన్ని, సుకుమార్ తర్వాత బన్ని, వేణు శ్రీరామ్ `ఐకాన్ కనపడుటలేదు` సినిమా స్టార్ట్ కానుంది.
ఈ సినిమాలో బన్ని కొత్త పాత్రలో కనపడబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల ప్రకారం బన్ని `ఐకాన్`లో నాలుగు గెటప్స్‌లో కనపడబోతున్నారట. అందులో ఒకటి మధ్య వయస్కుడి పాత్ర కావడం గమనార్హం. ఇప్పటి వరకు బన్ని మధ్య వయస్కుడిగా కనపడలేదు. తొలిసారి మధ్యవయస్కుడిగా బన్ని ఎలా మెప్పించనున్నాడో చూడాలి. కాగా మరో రెగ్యులర్ లుక్ ఉంటుందట. మిగిలిన రెండు లుక్స్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.