అల్లు అర్జున్ నన్ను నమ్మి మళ్ళీ వచ్చాడు..

  • IndiaGlitz, [Wednesday,June 02 2021]

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ నేడు తన 57వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. 1992లో లాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు గుణశేఖర్. ఇప్పటి వరకు ఆయన చేసింది కేవలం 12 చిత్రాలు మాత్రమే. గుణశేఖర్ చివరగా తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి.

చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ గుణశేఖర్ మెగాఫోన్ పట్టారు. అది కూడా పౌరాణిక నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆ చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ తన బర్త్ డే సందర్భంగా కెరీర్ ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆయన కెరీర్ లో హిట్స్ ఉన్నాయి.. అలాగే పరాజయాలు కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: శభాష్ పూజా హెగ్డే.. 100 కుటుంబాల కోసం..

మెగాస్టార్ చిరంజీవితో గుణశేఖర్ 'చూడాలని ఉంది' అనే హిట్ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే మహేష్ బాబు తొలి బ్లాక్ బస్టర్ 'ఒక్కడు' చిత్రాన్ని రూపొందించింది కూడా గుణశేఖరే. ఆ తర్వాత మహేష్ తో అర్జున్, సైనికుడు తీశారు. చిరంజీవి, గుణశేఖర్ రెండవ కాంబోలో వచ్చిన మృగరాజు నిరాశపరిచింది.

ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ ఎదురైన తర్వాత హీరోలు డైరెక్టర్స్ ని దూరం పెడతారా అని ప్రశ్నించగా.. తన విషయంలో అలా జరగలేదని గుణశేఖర్ అన్నారు. కొన్నిసార్లు నా కథలో లోపం ఉండొచ్చు.. నా ప్రయత్నంలో లోపం ఉండదు. వరుడు చిత్రంలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల సినిమా దెబ్బతినింది. కానీ నా ఎఫర్ట్ లో లోపం లేదని అల్లు అర్జున్ కి తెలుసు. అందుకే రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి నన్ను నమ్మి వచ్చాడు. నేను పని చేసిన అందరి హీరోల దగ్గర ఆ నమ్మకాన్ని కాపాడుకోగలిగా అని గుణశేఖర్ అన్నారు.