సమంతకు బన్నీ గిఫ్ట్

  • IndiaGlitz, [Monday,July 08 2019]

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మ్యూచువ‌ల్ అప్రిషియేష‌న్ చాలా కామ‌న్ అయిపోయింది. ఎవ‌రి సినిమా బాగా ఉన్నా స‌రే, వెంట‌నే మిగిలిన‌వారు దాని గురించి నాలుగు మంచి మాట‌లు చెప్ప‌డానికి వెన‌కాడ‌టం లేదు. ఈగోల‌ను ప‌క్క‌న‌పెట్టి ఒక‌రికొక‌రు ఫ్రెండ్లీగా స‌పోర్ట్ చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల‌ను బ‌న్నీ అలాగే ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టీమ్ ను బ‌న్నీ అభినందించారు. తాజాగా స‌మంత‌ను కూడా ఆయ‌న అభినందించారు. అదీ ఓ ట్వీటుతోనో, ఫోన్ చేసి ఓ మాట‌తోనో కాదు. ప్ర‌త్యేకంగా ఆమె కోసం గిఫ్ట్ పంపించి మ‌రీ బ‌న్నీ ఆమెను అభినందించారు. 

అంతే కాదు.. 'స‌మంతా నేను ఓ బేబీ చూశాను. ఆ విజ‌యానికి నిన్ను అభినందించాలంటే ఫోన్ కాలు.. పువ్వులు స‌రిపోవు. అంత‌కుమించి ఇంకేదైనా ఇవ్వాలి. అందుకే నీలాగే ఎదిగే బోన్సాయ్‌ను పంపిస్తున్నాను' అని ఓ నోటు కూడా రాశారు. వాట‌న్నిటినీ స‌మంత సోష‌ల్ మీడియాలో పెట్టేసింది. అంతే కాదు, బ‌న్నీ నుంచి త‌న‌కు అంత మంచి గిఫ్ట్ అందినందుకు క్లౌడ్ నైన్‌లో ఉంది స‌మంత‌. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలంటే ప్ర‌శంస‌లే కాదు, కాసులు కూడా కుర‌వాల‌న్నా ఆమె కాంక్ష 'ఓ బేబీ'తో తీరుతోంది.

❤️❤️❤️ https://t.co/PSLsgnwSAM

— Baby Akkineni (@Samanthaprabhu2) July 7, 2019

More News

లీకైన మహేష్ బాబు ఫొటోలు

మ‌హేష్ తాజా సినిమా `స‌రిలేరు నీకెవ్వ‌రు` స్టిల్ లీక‌య్యింది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో జ‌రుగుతోంది.

అల్లు వారి రామాయ‌ణం

వాల్మీకి రామాయ‌ణానికి ఆ త‌ర్వాతి కాలంలో చాలా వెర్ష‌న్లు వ‌చ్చాయి. వీడియో రూపంలోనూ రామాయ‌ణ‌గాథ‌లు అల‌రించాయి.

'మ‌న్మ‌థుడు 2' షూటింగ్ పూర్తి

టాలీవుడ్ కింగ్ నాగార్జున కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ హ్యాండ్ స‌మ్ లుక్‌లో్ క‌న‌ప‌డ‌ట‌మే కాదు.. వారితో పోటీ ప‌డుతూ లిప్‌లాక్‌లు చేస్తున్నాడు.

రాజుగారిగ‌ది వైపు అవికా చూపు

త‌మ‌న్నా ఉంటే `రాజుగారిగ‌ది 3`పై మంచి హైప్ వ‌స్తుంద‌ని అనుకున్నాడు డైరెక్ట‌ర్ ఓంకార్‌.

అంచనాలు పెంచిన సూర్య బందోబస్త్' టీజర్ 

​​​​​​​తీవ్రవాదం వలన భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు... రైతులు, నది జలాల సమస్యలు... ఇండియన్ ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్స్ నేపథ్యంలో రూపొందిన డిఫరెంట్ అండ్