close
Choose your channels

పెద్ద స్టార్ అయ్యుండి సింప్లిసిటీ: రోడ్ సైడ్ కాకా హోట‌ల్‌లో టిఫిన్ చేసిన బన్నీ.. ఫ్యాన్స్ ఫిదా..!

Monday, September 13, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పెద్ద స్టార్ అయ్యుండి సింప్లిసిటీ: రోడ్ సైడ్ కాకా హోట‌ల్‌లో టిఫిన్ చేసిన బన్నీ.. ఫ్యాన్స్ ఫిదా..!

మెగా కాపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా 2003 సంవత్సరంలో 'గంగోత్రి' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్.. తొలి సినిమాతోనే విజయం అందుకున్నారు. ఆ తర్వాత కూడా చేస్తున్న ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ ముందుకెళ్లిన ఆయన.. స్టైలీష్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. డైలాగ్‌ డెలివరీతో, డ్యాన్స్‌ స్టెప్పులతో, కొత్త లుక్స్‌తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌ సృష్టించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్‌గా వెలుగొందిన అల్లు అర్జున్‌ని ఇప్పుడు ఐకాన్ స్టార్ చేశారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.

క‌రోనా వ‌ల‌న ఆగిన పుష్ప చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం కాకినాడ‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. అంత‌కుముందు మారేడుమిల్లిలో జరిగింది. పది రోజుల పాటు కాకినాడ, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు. దాంతో ఓ పాట మినహా తొలి భాగం చిత్రీకరణ పూర్తవుతుందట. హైదరాబాద్‌ తిరిగొచ్చిన తర్వాత ప్రత్యేక గీతం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘పుష్ప’ చిత్రీకరణ మధ్యలో లభించిన విరామ సమయంలో కాకినాడలోని థియేటర్‌లో ‘సీటీమార్‌’ చిత్రాన్ని అల్లు అర్జున్‌ వీక్షించారు.

అయితే అల్లు అర్జున్ గోక‌వ‌రం ద‌గ్గ‌ర రోడు సైడ్ టిఫిన్ సెంట‌ర్‌లో టిఫిన్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. టిఫిన్ సెంట‌ర్ ఓన‌ర్‌కి డ‌బ్బులు ఇస్తుండ‌డం కూడా వీడియోలో క‌నిపిస్తుంది. అంతపెద్ద స్టార్ అయ్యుండి రోడ్డు పక్కన కాకా హోటల్‌లో టిఫిన్ చేసిన అల్లు అర్జున్ సింప్లిసిటీ చూసి షాక‌వుతున్నారు ఫ్యాన్స్.

ఇక పుష్ప చిత్రంలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ కనిపించని విధంగా బన్నీ సరికొత్తగా మాస్ లుక్ లో అలరించనున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.