close
Choose your channels

అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం

Saturday, February 6, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘కార్‌వాన్‌’కు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం ఖమ్మం రూరల్‌లోని సత్యనారాయణపురం దగ్గర ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా.. వెనక నుంచి వచ్చిన కంటెయినర్ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రమాద సమయంలో అల్లు అర్జున్ కార్‌వాన్‌లో లేడని చిత్ర యూనిట్ తెలిపింది.

ప్రమాద సమయంలో వాహనంలో అల్లు అర్జున్ లేడని చిత్ర బృందం తెలిపింది. ‘పుష్ప’ షూటింగ్ ప్రస్తుతం రంపచోడవరంలో జరుగుతోంది. ఈ షూటింగ్ నిమిత్తం రంపచోడవరం వెళ్లిన బన్నీ ముందే ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బన్నీ కార్‌వాన్‌లో ఆయన మ్యాకప్ టీమ్‌ హైదరాబాద్‌కు బయలు దేరింది. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కార్‌వాన్ డ్రైవర్.. అల్లు అర్జున్ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, కార్‌వాన్ వెనక భాగం మాత్రమే ధ్వంసమైందని పోలీసులు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.