close
Choose your channels

స్టోరీని మార్చేస్తున్న అల్లు అర్జున్‌

Sunday, August 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టోరీని మార్చేస్తున్న అల్లు అర్జున్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ముగియనుంది. మరి తదుపరి బన్నీ ఏ సినిమా చేస్తాడనే దానిపై చిన్నపాటి కన్‌ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే బన్నీ రెండు సినిమాలను లైన్‌లో పెట్టుకుని ఉన్నాడు. ఆ రెండింటిలో ముందు సుకుమార్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడని ముందు వార్తలు వచ్చాయి. తర్వాత వేణుశ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని కొన్ని రోజుల ముందు వరకు వినిపించిన వార్తలు అయితే అయితే ఇప్పుడు సుకుమార్ ఇంతకు ముందు యాక్షన్ డ్రామా బదులుగా లవ్ స్టోరీ చేద్దామని అన్నాడట. దానికి సుకుమార్ కూడా ఓకే అని కొత్త కథపై వర్కవుట్ చేస్తున్నాడట. ఈ స్క్రిప్ట్ సిద్ధం కావడానికి మూడు నుండి ఆరు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. ఆలోపు బన్నీ వేణు శ్రీరామ్ సినిమాను పూర్తి చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాల సమాచారం. తర్వాత సుకుమార్ సినిమాపై బన్నీ ఫోకస్ పెడతాడని టాక్.

మరి బన్నీ ఉన్నట్లుండి సుకుమార్‌ని కథను మార్చమనడానికి కారణం కొత్త తరహా లవ్ స్టోరీ చేద్దామనే ఆలోచనతోనేనట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అల.. వైకుంఠపురంలో..’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తే.. టబు కీలక పాత్రలో నటిస్తుంది.

బన్నీ ‘బీస్ట్’

బన్నీ ఈరోజు తన ‘బీస్ట్’ను అందరికీ పరిచయం చేశాడు. ఇంతకు బీస్ట్ అంటే మరేదో అనుకోకండి.. బన్నీ కొత్తగా కొన్న రేంజ్ రోవర్ కారు. బన్నీ తన రేంజ్ రోవర్ కారును తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి ‘‘ఇది నా కొత్త రేంజ్ రోవర్. దీనికి బీస్ట్ అనే పేరు పెట్టాను. ప్రతిసారి నేనెదైనా కొంటే నా మదిలో మెదిలేది ఒకటే, కృతజ్ఞత’’ అని మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. బీస్ట్ అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాడే వాహనం ముద్దు పేరు. మరి బన్నీ కూడా తన రేంజ్ రోవర్‌కి ఆపేరునే పెట్టుకున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.