అల్లు అర్జున్ వేసింది దోశ స్టెప్ అంటున్న అల్లు అర్హ‌

  • IndiaGlitz, [Friday,January 03 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్ప‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చేది ఆయ‌న వేసిన అద్భుత‌మైన డ్యాన్సులే. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని టాప్ డ్యాన్స‌ర్స్‌లోఅల్లు అర్జున్ ఒక‌డ‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. త‌న డ్యాన్స్‌, స్టైల్‌తో ఆక‌ట్టుకుంటోన్న అర్జున్ డ్యాన్స్‌ని ఆయ‌న ముద్దుల కూతురు అర్హ మాత్రం దోశ స్టెప్ అని అంటుంది. అర్హ క్యూట్‌గా మాట్లాడుతున్న ఓ వీడియో పోస్ట్ చేసింది అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహ‌. ఈ వీడియో పాటు దోశ స్టెప్ అని ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్న ఎమోజీని కూడా పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో పాప‌తో బ‌న్నీతో మాట్లాడుతున్నాడు. నాన్న సినిమా పేరేంటి? అని అడిగితే అల వైకుంఠ‌పుర‌ములో అని.. నాన్న ఎల్లో జాకెట్ వేసుకుని డ్యాన్స్ చేసిన పాట ఏద‌ని అడిగితే రాములో రాముల అని, నాన్న వేసిన స్టెప్ ఏంట‌ని అడిగితే దోశ స్టెప్ అని రెండు చేతులు తిప్పుతూ డ్యాన్స్ చేసింది అర్హ‌. వీడియోను నెటిజ‌న్స్ తెగ లైక్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వీడియోను మూడు ల‌క్ష‌ల మంది చూశారు.

అల్లు అర్జున్ తాజా చిత్రం అల‌..వైకుంఠ‌పుర‌ములో సంక్రాంతి సందర్భంగా విడుద‌ల‌వుతుంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.