దువ్వాడ జగన్నాధమ్ షూటింగ్ ప్రారంభం..!

  • IndiaGlitz, [Thursday,October 20 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం డి.జె దువ్వాడ జ‌గ‌న్నాధ‌మ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ & టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ ఫ‌స్ట్ డే షూటింగ్ వ‌ర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసారు. ఈరోజు ప్రారంభ‌మైన ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్ర‌వ‌రికి పూర్తి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

More News

ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన బాబు...పృథ్వీ - అల్లరి నరేష్

'బెంగాల్టైగర్'వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఒక్క ఐడియా కోటి రూపాయలు అన్నది ట్యాగ్లైన్.

జనతా గ్యారేజ్ అర్ధశతదినోత్సవం..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం జనతా గ్యారేజ్.

మరోసారి పొలిటీషియన్ గా....

ఖైదీ నంబర్ 150వ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయకుండా బయటకు వచ్చేసిన హీరోయిన్ క్యాథరిన్..

సర్కార్ తో గౌతమిపుత్రుడి ముచ్చట్లు....

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో,అమితాబ్ టైటిల్ పాత్రలో వచ్చిన 'సర్కార్',

అక్టోబర్ 27న 'ఎంత వరకు ఈ ప్రేమ' ఆడియో

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా