close
Choose your channels

అల్లువారింట సీక్రెట్‌గా రెండో పెళ్లి!

Friday, June 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లువారింట సీక్రెట్‌గా రెండో పెళ్లి!

టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య బాబీ రెండో వివాహం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సోషల్ మీడియాలో ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జూన్-21న అల్లు బాబీకి నీలు అనే యువతితో వివాహం జరిగింది! కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల మధ్యే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహం జరిగిన విషయాన్ని అల్లు ఫ్యామిలీ చాలా గోప్యంగా ఉంచింది. రెండో పెళ్లి కావడంతో ఇంత సీక్రెట్‌గా జరిగిందని సమాచారం. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న ఫొటోలను బట్టి చూస్తే అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్క శిరీష్ తప్ప మరెవ్వరూ కనిపించలేదు. అల్లు అరవింద్ కానీ.. అర్జున్ కానీ ఎవరూ లేరు.

కాగా ఈ పెళ్లి వేడుక గురించి ఇంతవరకూ అల్లు వారి కుటుంబ సభ్యులు ఏ ఒక్కరూ రియాక్ట్ అవ్వలేదు. అసలు ఈ పెళ్లి నిజంగా జరిగిందా..? లేకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేశారా..? అనే విషయంపై కూడా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే బాబీకి మొదటి పెళ్లికాగా కొన్ని అనివార్య కారణాలు విడిపోయినట్లు సమాచారం. అల్లు బాబీకి అన్విత అనే కుమార్తె కూడా ఉంది. అయితే అల్లు అరవింద్ కుమారుల్లో ఇద్దరు టాలీవుడ్ హీరోలుగా రాణిస్తుండగా.. గీత ఆర్ట్స్‌తో పాటు అల్లు కుటుంబానికి సంబంధించిన అన్ని బిజినెస్ పనులూ బాబీనే చూసుకుంటున్నారు. అయితే ఈ రెండో పెళ్లి గురించి అల్లు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.