మ‌హేశ్ బాట‌లో బ‌న్ని...

  • IndiaGlitz, [Wednesday,December 05 2018]

రీసెంట్‌గా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఎఎంబి సినిమాస్‌తో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ బిజినెస్ రంగంలోని అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేశ్ బాట‌లో బ‌న్ని కూడా రాబోతున్నాడ‌ని సమాచారం.

బ‌న్ని అమీర్ పేట‌లోని స‌త్యం థియేట‌ర్ ప్లేస్‌లో ఓ పెద్ద మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ను క‌ట్టాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఆ వైపు ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే ప‌బ్ ద్వారా సినిమాలు కాకుండా కొత్త రంగాన్ని బిజినెస్‌గా స్టార్ట్ చేసిన బ‌న్నికి ఇది మ‌రో కొత్త రంగం అవుతుంది. మ‌రో వైపు ఓ కొత్త సినిమా ఆఫీస్‌ను కూడా బ‌న్ని ఓపెన్ చేసిన సంగ‌తి తెలిసిందే.