'జెర్సీ' కి బన్ని ఫిదా
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన `జెర్సీ` సినిమా శుక్రవారం విడుదలైంది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల ప్రశంసలు పొందుతుంది. శుక్రవారం సినిమా చూసిన ఎన్టీఆర్ `బ్రో నువ్వు కొట్టిన బంతి స్టేడియం బయట పడింది. బ్రిలియంట్.. బ్రిలియంట్.. బ్రిలియంట్ పెర్ఫామెన్స్. నీ పెర్ఫామెన్స్ భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది` అంటూ నానిని జూనియర్ ఆకాశానికెత్తేశాడు.
ఇప్పుడు బన్ని కూడా `జెర్సీ` యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ``ఇప్పుడు సినిమా చూశాను. హార్ట్ టచింగ్ మూవీ. ప్రతి అంశాన్ని ఇందులో ఇష్టపడ్డాను. ఎంటైర్ టీంకు అభినందనలు. నాని రాకింగ్ పెర్ఫామెన్స్. ఇప్పటి వరకు తన సినిమాల్లో ఇదే పెర్ఫామెన్స్. కెప్టెన్ గౌతమ్ తిన్ననూరి స్పెండిడ్ వర్క్. మూవీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది`` అంటూ బన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
nailed it . Last and most imp. the captain Gowtham Tinnanuri . Splendid work . Steady & Bold . Such a sweet film. Movie lovers ...its a Must watch.
— Allu Arjun (@alluarjun) April 19, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.