close
Choose your channels

రెండు వారాలు వెయిటింగ్‌లో పెట్టిన బ‌న్నీ

Tuesday, February 23, 2021 • తెలుగు Comments

రెండు వారాలు వెయిటింగ్‌లో పెట్టిన బ‌న్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం పుష్ప‌. ఇప్ప‌టికే మారేడుమిల్లి, రంప‌చోడ‌వ‌రం ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మూడో షెడ్యూల్‌కి సిద్ధ‌మ‌వుతోంది. అయితే ఈ షెడ్యూల్‌ను అల్లు అర్జున్ కాస్త వెన‌క్కి జ‌రిపిన‌ట్టు స‌మాచారం. ఎందుకంటే.. రెండు వారాల పాటు అల్లు అర్జున్ విదేశాల‌కు వెళ్లాడు. ఏ ఫారిన్ కంట్రీకి వెళ్లాడనే సంగ‌తి తెలియడం లేదు కానీ.. రెండు వారాల పాటు పుష్ప కేర‌ళ షెడ్యూల్ వాయిదా ప‌డింది.

శేషాచ‌ల అడ‌వుల్లో జరిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో బ‌న్నీ క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటి వ‌ర‌కు బ‌న్నీ చేయ‌న‌టువంటి ఓ డిఫ‌రెంట్ లుక్‌ను ఈ సినిమా కోసం ట్రై చేస్తుండ‌టం విశేషం. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాను ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz