హాట్ స్టార్ నూత‌న ప్ర‌చారాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్..

  • IndiaGlitz, [Friday,May 20 2016]

భార‌త‌దేశ‌పు అతి పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంది.స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక చేసుకుంది. ఉత్సాహ‌పూరిత‌మైన తెలుగు సినిమాలు మ‌రియు షోస్ ను ఆవిష్క‌రించిన హాట్ స్టార్ అన్నీపూర్తి ఉచితంగా అందిస్తుంది. భార‌త‌దేశ‌పు అతి పెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్, భార‌త‌దేశంలో ఎనిమిది భాష‌ల్లో 80 వేల గంట‌ల ప్రపంచ శ్రేణి వినోద కంటెంట్ ను అందిస్తున్న‌హాట్ స్టార్, ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని త‌మ ప్రాంతీయ భాషా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత‌గా చేరువ‌వుతుంది. హాట్ స్టార్, ఇప్పుడు 6 వేల గంట‌ల‌క పైగా కంటెంట్ ను తెలుగులో అందిస్తుంది. దీనిలో తాజా చిత్రాలు.. క్లాసిక్ గా నిలిచిన తెలుగు చిత్రాలు, పాపుల‌ర్ టీవీ షోలు ను అందిస్తుంది.

హాట్ స్టార్ తో ఈ అనుబంధం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ...ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ స్టార్ ముఖ చిత్రంగా నేను నిల‌వ‌డం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది స్ట్రీమింగ్ స‌ర్వీస్. నేను త‌రుచుగా దీనిని వాడుతుంటాను. అదీ కాకుండా ఈ బ్రాండ్ ఇటీవ‌లి కాలంలో వ‌చ్చింది. ఇది పూర్తిగా ఆక‌ట్టుకునే రీతిలో ఉంటుంది. నేను షూటింగ్ తో బిజీగా ఉన్న‌ప్పుడు స్పోర్ట్స్ స్కోర్ ల‌ను తెలుసుకోవ‌డంలో నాకు హాట్ స్టార్ స‌హాయ‌ప‌డుతుంది. నా వ్యానిటీ వ్యాన్ లో భారీ స్ధాయి టెలివిజ‌న్ సెట్ నాకు అవ‌స‌రం లేదు. నా ఫోన్ లో హాట్ స్టార్ ఉంటే చాలు ప్ర‌తిదీ మ‌నం చూడ‌వ‌చ్చు అన్నారు.

సౌత్ స్టార్ ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ కె మాధ‌వ‌న్ మాట్లాడుతూ...మా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా అల్లు అర్జున్ ను ప్ర‌క‌టిస్తుండ‌టం ప‌ట్ల మేం చాలా ఆనందంగా ఉన్నాం. ఆయ‌న‌కున్న ఫ్యాన్ బేస్ ఖ‌చ్చితంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రియు తెలంగాణ ల్లో హాట్ స్టార్ వీక్ష‌కుల సంఖ్య‌ను విస్తృతం చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. భార‌త‌దేశ‌పు అతి పెద్ద డిజిట‌ల్ కంటెంట్ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రియు తెలంగాణా రాష్ట్రాల్లో సుపీరియ‌ర్ డిజిట‌ల్ సేవ‌ల‌ను బ్రాండ్ల‌తో పాటుగా తెలుగు సినిమాలు, టెలివిజ‌న్ ఎకో సిస్ట‌మ్ కు అందించ‌డం ద్వారా స్ధిరీక‌రించుకోవాల‌ని భావిస్తుంది అన్నారు.

అజిత్ మెహ‌న్, సీఈవో హాట్ స్టార్ మాట్లాడుతూ...గ‌త 15 నెల‌లుగా హాట్ స్టార్, యువ భార‌తానికీ ప్రాధ‌మిక స్ర్కీనింగ్ గా త‌న‌కు తాను నిలిచింది.అత్యుత్త‌మ తెలుగు సినిమాలు మ‌రియు టీవీ షోల‌ను వినియోగ‌దారుల‌కు పూర్తి ఉచితంగా అందిస్తున్న ఒకే ఒక్క వేదిక‌గా మేం నిలిచాం. దేశంలోని ఈ రెండు రాష్ట్రాల‌లో ఉన్న‌టువంటి, అత్యున్న‌త కంటెంట్ ను వినియోగించాల‌ని ఆరాట‌ప‌డే ఆతృత క‌లిగిన వినియోగ‌దారుల‌కు అసాధార‌ణ ఆఫ‌రింగ్ అందించ‌డానికి మేం పూర్తి ఆస‌క్తితో ఉన్నాం. హాట్ స్టార్ లో 290 కు పైగా తెలుగు చిత్రాలు, 34 టీవీ షోలు ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫామ్ పై ల‌భిస్తున్న అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రాల్లో కంచె, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రాజు గారి గ‌ది, బాహుబ‌లి ఉన్నాయి. అత్యంత ప్ర‌జాదార‌ణ పొందిన టీవీ షోల‌లో అష్టాచ‌మ్మా, జాన‌కి రాముడు, శశిరేఖా ప‌రిణ‌యం మ‌రియు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 2015లో ఆవిష్క‌రించ‌బ‌డిన హాట్ స్టార్, ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా లేని రీతిలో నూత‌న సేవ‌ల‌ను అత్యంత వేగంగా ఆవిష్క‌రించిన సంస్థ‌గా నిలిచింది. గ‌డిచిన 15 నెల‌ల్లో 65 మిలియ‌న్ల‌కు పైగా దీనిని డౌన్ లోడ్ చేసుకున్నారు. దేశంలో ఒకే ఒక్క ప్రీమియం స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఇది. టీవీ, షోలు సినిమాలు లైవ్ స్పోర్ట్స్ ను దేశంలో పూర్తి ఉచితంగా చూసే అవ‌కాశం క‌ల్పిస్తుంది అన్నారు.

More News

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబును అభినందించిన మీడియా మొఘల్ రామోజీరావు

ఆరు వందలకు పైగా చిత్రాల్లో నాయకుడు, ప్రతి నాయకుడు, నిర్మాతగా ఇలా అన్ని విభాగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నట జీవితంలో నాలుగు దశాబ్దాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

శ్రీమంతుడు బాటలో నందకృష్ణుడు

మహేశ్ అంటే పేరు కాదు అదో బ్రాండ్ అయిపోయింది... నేటితరం టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న మహేశ్ ను ప్రేక్షకులే కాదు యంగ్ హీరోలు కూడా ఫాలోఅవుతున్నారు.

అభిమానులు సమక్షంలో ఘనంగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలు

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు తనయుడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ఈరోజు(మే 20న) తన పుట్టినరోజు వేడుకలను జూబ్లీ హిట్స్ లోని మోహన్ బాబు  నివాసంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో కొత్త చిత్రం 'లక్ష్మీ బాంబ్' ప్రారంభం

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్బబ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ కొత్త చిత్రం లక్ష్మీ బాంబ్, ఫ్రమ్ శివకాశి ట్యాగ్ లైన్ శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వ‌చ్చేసింది..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో న‌టిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.