ఫ్యాన్స్‌కు ఇఫ్తార్ విందు ఇచ్చిన బ‌న్ని

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

టాలీవుడ్‌లో న‌యా ట్రెండ్ స్టార్ట‌య్యింది. ఇంత‌కు ఆ ట్రెండ్ ఏంటో తెలుసా..ఇఫ్తార్ విందు. ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. సాధార‌ణంగా ఇలాంటి విందు పొలిటిక‌ల్ సర్కిల్‌లో ఎక్కువ‌గా జ‌రుగుతుంటుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్‌కు కూడా పాకింది. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీకి సంబంధించిన హీరోలు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తే చెప్పుకునేవారు కాదేమో.. కానీ ఇప్పుడు బ‌య‌ట‌కు చెప్పుకుంటున్నారు. రీసెంట్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ ఎమ్మెల్యే హోదాలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న అభిమానులకు ఇఫ్తార్ విందు ఇవ్వ‌డం విశేషం.