బ‌న్నీ పాఠాలు

  • IndiaGlitz, [Saturday,January 25 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే అంద‌రిలో ఓ ఆస‌క్తి నెల‌కొంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య‌, ఆర్య 2 చిత్రాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వీరిద్ద‌రూ ఓ హ్యాట్రిక్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగ‌తి కూడా తెలిసిందే. అయితే ప్ర‌తి డైరెక్ట‌ర్‌కి ఓ స్టైల్ ఉంటుంది. సుకుమార్ విష‌యానికి వ‌స్తే రంగ‌స్థ‌లంలో రామ్‌చ‌ర‌ణ్‌ని ప‌క్కా మాస్ కోణంలో చూపించిన సుకుమార్ అలాంటి మ‌రో రగ్డ్ లుక్‌లోనే బ‌న్నీని కూడా చూపించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇక బ‌న్నీ కూడా సుకుమార్ స‌ల‌హాల‌ను ఫాలో అయిపోతున్నాడు. కొత్త చిత్రానికి సిద్ధ‌మైపోతున్నాడు.

చిత్తూరు జిల్లా శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్. అందుక‌ని బ‌న్నీని చిత్తూరు జిల్లా యాస నేర్చుకోమ‌ని సుకుమార్ సూచించాడు. ఇంకేం! బ‌న్నీ కూడా చిత్తూరు జిల్లా యాస‌తో త‌న గొంతుక‌తో ప‌లికించ‌డానికి సిద్ధ‌మైపోతున్నాడు. అందులో భాగంగా బ‌న్నీ ఓ ట్రైన‌ర్‌ను నియ‌మించుకుని చిత్తూరు జిల్లా యాస‌ను నేర్చుకుంటున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం.

అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సొంతం చేసుకున్న బ‌న్నీ త‌దుప‌రి సినిమా.. అది కూడా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో కాబ‌ట్టి సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. రంగ‌స్థ‌లం వంటి భారీ హిట్ త‌ర్వాత సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం కూడా ఇదే మ‌రి!.

More News

హైదరాబాద్, బెంగళూరుకు పాకిన కరోనా వైరస్!!

కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ వైరస్ బారీన పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

పాక్, కేంద్రంకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్‌ వార్నింగ్!

హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే.

ఏఎంబీకి మించిన మల్టీఫ్లెక్స్‌ నిర్మించబోతున్న మహేశ్!

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అమరావతిలో పవన్‌కు 62 ఎకరాలపై జనసేన క్లారిటీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అమరావతిలో 62 ఎకరాలు భూములు ఉన్నాయని..

ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకుంది. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ టీవీ సీరియల్‌తో