అల్లు అర్జున్ ట్రెండింగ్...

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళం, మ‌ల‌యాళ రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. బ‌న్ని సోష‌ల్ మీడియాకు సంబంధించిన ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. ట్విట్ట‌ర్ అకౌంట్ కాస్త ఆల‌స్యంగా ఓపెన్ చేసినప్ప‌టికీ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకోవ‌డం బ‌న్ని ముందుంటున్నారు.

త‌న ఫ్యామిలీకి సంబంధించిన ముఖ్య‌మైన ఫోటోల‌తో పాటు శుభాకాంక్ష‌లు వంటి విష‌యాల‌ను చెప్ప‌టానికి బ‌న్ని ట్విట్ట‌ర్‌నే వేదిక చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న్ను ట్విట్ట‌ర్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య రెండు మిలియ‌న్స్‌కు చేరింది. 'నన్ను ఫాలో అవుతున్న రెండు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌కు థాంక్స్‌. మీ ప్రేమాభిమానాల‌కు కృత‌జ్ఞ‌త‌లు' అంటూ బ‌న్నిఈ సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌డం విశేషం.