ఆ లిస్టులో బ‌న్నీ కూడా చేరాడు...

  • IndiaGlitz, [Sunday,February 14 2021]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఓ అరుదైన గౌర‌వం ద‌క్కింది. అదేంటంటే, జీక్యూ ఇండియా విడుద‌ల చేసిన ప్ర‌తిభావంతులైన భారతీయుల జాబితాలో అల్లు అర్జున్‌కు చోటు ద‌క్కిన విష‌యాన్ని ప్ర‌క‌టించింది. దేశంలో క్రీడ‌లు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇలా ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ లిస్టులో ఉన్నారు. క్రికెట‌ర్ కె.ఎల్‌.రాహుల్‌, రిష‌బ్ పంత్‌, హాస్య‌న‌టుడు దినేష్ సేథ్‌, ఇలా అంద‌రితో కూడిన జాబితాను జీక్యూ వారు త‌యారు చేశారు. ఈ లిస్టులో బ‌న్నీ చోటు ద‌క్కించుకోవ‌డంపై ఆయ‌న అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌త ఏడాది విడుద‌లైన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసిన అల్లు అర్జున్‌..హిందీ ఆడియెన్స్‌లోనూ గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే మార్కెట్ పరంగా.. తెలుగు, మ‌ల‌యాళ భాష‌లతో పాటు మార్కెట్‌ను పెంచుకునే క్ర‌మంలో ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ పుష్ప‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సుకుమార్ పుష్ప సినిమాను తెర‌కెక్కిస్తుండ‌గా, ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

ఈ-రిక్షాలు పంపిణీ చేసిన సోనూసూద్

లాక్‌డౌన్ సమయంల నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ తన ప్రత్యేకతను చాటుతూనే ఉన్నాడు.

సెట్ వేయలేదు.. నాని అక్క‌డకే వెళ్లాడు..

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఏక‌ధాటిగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు.

మార్చ్ 5న డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రం 'A'

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై మోస్ట్ క్రియేటివ్ టెక్నికల్ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో

శ్రీరెడ్డి హీరోయిన్‌గా సిల్క్‌స్మిత బయోగ్రఫీ

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో పెద్దగా నటి శ్రీరెడ్డి గురించి వినిపించడం లేదు.

కొడాలి నానిపై కేసు నమోదు చేయండి: ఎస్‌ఈసీ ఆదేశం

మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని, కృష్ణా జిల్లా ఎస్పీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.